టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు యంగ్ హీరో నాగశౌర్య.ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినీ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చినప్పటికీ వరుస సినిమాలు చేస్తూ హీరోగా మంచి గుర్తింపు పొందాడు. ఇదిలా ఉంటే ఇక టాలీవుడ్ ని ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న శంకర ప్రసాదు మూల్పురి ఉషా మోల్పురి లో వైరా క్రియేషన్స్ బ్యానర్ను స్థాపించి కొడుకు నాగేశ్వర్ తో పాటు ఎందరో హీరోల సినిమాలు నిర్మిస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే ఇక ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హ్యాండ్సమ్ హీరోల లిస్టులో మొదటగా వినిపించే పేరు నాగ శౌర్య ఈయనకి లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు.
ఇదిలా ఉంటే ఇక ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం నాగశౌర్యం నటిస్తున్న ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి నారీ నారీ నడుమ మురారి పోలీస్ వారి హెచ్చరిక వంటి సినిమాలు అన్ని ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. సాధారణంగా యంగ్ హీరో నాగ శౌర్య ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి చాలామందికి తెలిసి ఉంటుంది.నాగశౌర్యం అమ్మా నాన్న గురించి అందరికీ తెలుసు. కానీ తన మేనత్త కూడా ఒక నటి అని చాలామందికి తెలియదు. అయితే నాగశౌర్య మేనత్త పేరు లతా శ్రీ.ఈమె నాగశౌర్య తండ్రికి స్వయంగా సొంత చెల్లెలు.యమలీల సినిమాలోని అభినందనం యువ రాజా అనే పాట అందరికీ గుర్తుంటే ఉంటుంది.
అయితే ఈ పాటలో ఆడి పాడిన నటి ఈమెనే. అంతే కాదు ఆమె జంబలకడిపంబ ఆ ఒక్కటి అడక్కు నంబర్ వన్ వంటి సినిమాలలో మరియు దక్షిణాది భాషల్లో దాదాపు 70 కి పైగా అనే సినిమాలు చేసింది. అనంతరం ఆమె జిమ్ ట్రైనర్ను ప్రేమ వివాహం చేసుకుంది ఈమె. అప్పటినుండి సినిమాలకు దూరమైంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈమె మళ్ళీ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అత్తిలి సత్తిబాబు సినిమా ద్వారా 2007లో ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఈమె ఆ సినిమా ఈమెకి ఏమాత్రం కలిసి రాలేదు. ప్రస్తుతం ఆమెకి ఇద్దరు కొడుకులు. అయితే ఈమె నాగశౌర్య ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ... అన్నయ్య మనవాడే మేనల్లుడు సొంతవాడే కానీ వదిన మనవాళ్లు అవ్వరు కదా మమ్మల్ని ఎప్పుడూ వాళ్ళు పట్టించుకోరు అంటూ తన ఆవేదనను వ్యక్తం చేసింది లతాశ్రీ ..!!