ఆ సినిమా వల్ల నిద్రలేని రాత్రులు గడిపిన నాని..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ హీరోలుగా  ఎదిగిన హీరోల్లో నాని కూడా ఒకరు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి అష్టాచమ్మా సినిమాతో హీరోగా తన స్వయంకృషితో నాచురల్ స్టార్ నానిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు నాని.ఆ సినిమానంతరం వరస హిట్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. అనంతరం బిగ్ బాస్ అని ఒక రియాల్టీ షోకి హోస్ట్ గా కూడా వ్యవహరించాడు నాని. ఇలా స్వయంకృషితో హీరోగా తనకంటూ ఒక ఇమేజ్ ని దక్కించుకున్న నాని కొన్ని ఫ్లాప్ సినిమాల్లో కూడా నటించడం జరిగింది.

 అయితే అలా నాని నటించిన సినిమాలలో ఒక సినిమానానికి అసలు నిద్ర లేకుండా చేసింది అన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా  వైరల్ అవువుతున్నాయి. నాని శరణ్య మోహన్ జంటగా నటించిన తాతనేని సత్య దర్శకత్వంలో వచ్చిన భీమిలి కబడ్డీ జట్టు సినిమా 2010 జూలై 10న రిలీజ్ అవ్వడం జరిగింది. దానికంటే ముందే నాని అష్టాచమ్మా సినిమాలో హీరోగా నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ఆ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమా పై భారీ అంచనాలను నెలకొన్నాయి. అంచనాలకు తగ్గట్టుగా  ఈ సినిమా ఓపెనింగ్స్ మంచిగానే తెచ్చుకుంది.

ఈ సినిమాని తక్కువ బడ్జెట్ తో నిర్మించడంతో బయ్యర్లకు కూడా ఈ సినిమా ద్వారా ఎలాంటి నష్టం రాలేదు. అయితే నాని మరియు శరణ్య మోహన్ జంటగా నటించిన సినిమా విడుదలైన రెండు మూడు వారాలకి కొన్ని థియేటర్ల నుండి తీసేయడం జరిగింది. అయితే ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ఆఖరిలో చనిపోవడంతో ఈ సినిమాపై నెగిటివ్ టాక్ రావడం జరిగింది. సినిమా హిట్ అవుతుంది అన్న ఆలోచనలో నాని ఈ సినిమాలో చనిపోయే సీన్ చేయడానికి అప్పట్లో ఒప్పుకున్నాడట. కానీ నాని అనుకున్నట్లు జరగకుండా సీన్ రివర్స్ అయింది. ఇక అలా మనోవేదనకు గురైన నాని ఈ సినిమాతో నిద్రలేని రాత్రులు గడిపాడట. సినిమా రివ్యూ బాగున్నప్పటికీ ఈ సినిమాకి సంబంధించి నెగటివ్ ప్రచారం జరిగింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: