టాలీవుడ్ దర్శకుల్లో టాప్ దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు డైరెక్టర్ శంకర్. సాధారణంగా డైరెక్టర్ శంకర్ సినిమా అంటే భారీ అంచనాలు నెలకొంటాయి. ఆయన తెరకెక్కించే ప్రతి సినిమాల్లోనూ తనదైన ముద్ర కనిపిస్తుంది.అంతేకాదు తన సినిమాల్లో పాటలకు సైతం ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అంతేకాదు ముఖ్యంగా డైరెక్టర్ శంకర్ తన సినిమాలోని పాటల కోసం భారీగా ఖర్చు చేస్తూ ఉంటాడు. ఆయన డైరెక్ట్ చేసిన కొన్ని సినిమాల్లోని పాటలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఒకే ఒక్కడు మగధీర అపరిచితుడు రోబో వంటి సినిమాలలో కొన్ని పాటలకు ఎన్నో కోట్లు ఖర్చు చేశారు డైరెక్టర్ శంకర్.
ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు దర్శకుడు శంకర్.ఇక ఈ సినిమాలో కీయార అద్వానీ మరియు అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు శిరీష్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించడం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో అద్భుతం అనిపించేలా శంకర్ కొన్ని సన్నివేశాలని మలుస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇక ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుండి ఈ సినిమాకి సంబంధించిన ఏవో ఒక వార్తలు సోషల్ మీడియా వేదికగా వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా పొలిటికల్ త్రిల్లర్గా ఉంటుందని భారీ యాక్షన్ సీన్లు ఉంటాయని
ఇక దాదాపు ఏడు నిమిషాల పాటు ఉండే ఈ సీన్ కోసం ఏకంగా 70 కోట్లు ఖర్చు చేశారని దాని అనంతరం ఈ సినిమాలోని ఒక పాటకి గాను ఏకంగా 25 కోట్లకు పైగానే బడ్జెట్ను కేటాయించారని.. మరొక పాట కోసం ఎనిమిది కోట్లను ఖర్చు చేశారని.. అంతే కాదు రామ్ చరణ్ మరియు కీర మీద డ్యూయెట్ కోసం 15 కోట్లు ఖర్చు చేశారని ..గతంలో రకరకాల వార్తలు వచ్చాయి. వీటితోపాటు తాజాగా మరొక రూమర్ కూడా వినిపిస్తుంది. అయితే ఈ సినిమాలో రాబోయే మరో పాట కోసం 15 కోట్లు పెట్టి చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. ఈ పాటని రాంచరణ్ మరియు అంజలి షూట్ చేయబోతున్నారు. అంతేకాదు ఈ పాటలో మీ ఇద్దరికీ మంచి డాన్స్ స్టెప్పులు కూడా ఉండబోతున్నాయని అంటున్నారు. ఇక ఈ వార్తల్లో నిజమవుతుందో తెలియాలి అంటే ఈ విషయంపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది..!!