ఆ హీరోలపై షాకింగ్ వ్యాఖ్యలు చేసిన అర్చన...!!
కొంతమంది హీరోల గురించి మాట్లాడుతూ అర్చన ఈ విషయాలను చెప్పుకొచ్చారట.. రాధా గోపాళం మూవీలో ఛాన్స్ మిస్సైందని ఒక సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయడం వల్ల నాకు హీరోయిన్ ఛాన్స్ పోయిందని అర్చన చెప్పుకొచ్చారు.
ఆ సినిమా లో కనుక నటించి ఉంటే నా గ్రాఫ్ అద్భుతంగా ఉండేదని కూడా అర్చన పేర్కొన్నారు. కొంతమంది క్యారెక్టర్ల్ ఆర్టిస్ట్ గా చేసి హీరోగా సక్సెస్ అయ్యారని నేను మాత్రం అలా కాలేదని ఆమె తెలిపారు. తెలుగు వాళ్లు నేను ఎక్కడికి వెళ్లినా కూడా నాకు ఇంకా ఆఫర్లు రావాలని చెబుతున్నారని అర్చన చెప్పుకొచ్చారు.యమదొంగలో ఛాన్స్ వస్తే నేను చాలా ఆనందించాను.
యమదొంగ మూవీ నాకు చాలా ప్లస్ అయిందని అర్చన కామెంట్లు కూడా చేశారు. ప్రస్తుతం వెరైటీ రోల్స్ అయితే వస్తున్నాయని అర్చన అన్నారట.రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర నాకు బాగా నచ్చిందని ఆమె తెలిపారు. ఒక అమ్మాయి వీక్ గా ఉంటే ఆ అమ్మాయి మైండ్ క్యాప్చర్ చేయడానికి ఎంతో మంది ఉంటారని అర్చన అన్నారు. ఒక హీరో నాకు తెలీకుండా నా గురించి కొన్ని స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారని ఆమె పేర్కొన్నారు.ఆ హీరోది వంకరబుద్ది అని అర్చన తెలిపారు.
ఎవరి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ లో అందంగా ఉన్న అమ్మాయిల ను కొంతమంది హీరోలు ట్రాప్ చేస్తారని అర్చన చెప్పుకొచ్చారు.. మనకు ఏది మంచి అనేది ఏది చెడు అనేది మనకే తెలుస్తుందని అర్చన పేర్కొన్నారు. నాకు తల్లీదండ్రుల సపోర్ట్ బాగా ఉందని అర్చన తెలిపారు. అర్చన వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.