అక్కినేని మన్మధుడిగా మరియు కింగ్ నాగార్జున గా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న కింగ్ నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.చాలా కాలం తరువాత ఆయన నటించిన ది గోస్ట్ సినిమాతో పలకరించాడు. నాగార్జున ప్రవీణ సత్తార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎవరు ఊహించని విధంగా డిజాస్టర్ గా మిగిలింది. అసలే సరైన హిట్ సినిమాలు లేక సతమతమవుతున్న నాగార్జునకు ది గోస్ట్ సినిమా మరింత నిరాశను అందించింది. అయితే తాజాగా తన నెక్స్ట్ సినిమాని పాపులర్ రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ దర్శకత్వంలో చేసేందుకు ఒప్పుకున్నాడు నాగార్జున.
తాజాగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ధమాకా సినిమాకి ప్రసన్నకుమార్ స్క్రీన్ ప్లే అందించిన సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ప్రసన్నకుమార్ ని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ నాగార్జున ఓ సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నాగార్జున కెరీర్లో 99వ సినిమా ఇది. అయితే ఇప్పటికే ప్రసన్నకుమార్ ఈ సినిమాకి సంబంధించిన కథని కూడా నాగార్జునకు వినిపించడంతో నాగార్జున ఓకే కూడా చేశాడట. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో
ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో అల్లరి నరేష్ కనెక్ట్ కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మృనాల్ ఠాగూర్ నీ పెట్టాలని నాగార్జున అంటున్నాడట.టాలీవుడ్ ని ఇండస్ట్రీకి సీతారామం సినిమాతో పరిచయమైంది ఈమె. అనురాగపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు పొందడంతో ఈ సినిమా కథకి మృణాల్ ఠాగూర్ హీరోయిన్ గా అయితే బాగుంటుందని నాగార్జున భావించి ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది..!!