తెలుగు సినీ దిగ్గజ దర్శకుడు, నటుడు, రచయిత అయిన కళాతపస్వి కే .విశ్వనాథ్ మరణించిన విషయం తెలిసిందే. వృద్ధాప్య సమస్యల కారణంగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఆయన్ని కడసారి చూసుకోవడానికి సినీ, రాజకీయ ప్రముఖులు తరలివస్తు ఆయన పార్ధీపదేహానికి నివాళులు అర్పించారు. ఇక విశ్వనాధ్ గారి అంత్యక్రియలు పంజాగుట్టలోని స్మశాన వాటికలో ముగిసాయి. అభిమానుల అశ్రునయనాల మధ్య ఫిలింనగర్ నుంచి పంజాగుట్ట వరకు ఆయన అంతిమయాత్ర కొనసాగింది.
ఇక తన సినీ ప్రస్థానంలో ఎన్నో అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించడమే కాకుండా నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. అక్కినేని నాగేశ్వరావు గారు హీరోగా వచ్చిన 'ఆత్మగౌరవం' అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆయన.. మొదటి సినిమాతోనే తన మార్క్ చూపించారు. ఆ తర్వాత శంకరాభరణం, స్వాతిముత్యం, స్వయంకృషి, సప్తపది, శుభలేఖ, స్వర్ణకమలం వంటి మరెన్నో ఆణిముత్యాల లాంటి సినిమాలు తీసి తెలుగుజాతి ఖ్యాతిని పెంచారు.ముఖ్యంగా సామాజిక సమస్యలు, శాస్త్రీయ సంగీతం, నృత్య ప్రాధాన్యత చిత్రాలను తెరకెక్కించి తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక పేజీని లిఖించుకిన్నారు.
అలాంటి ఈ గొప్ప దర్శకుడు, నటుడికి ఈ తరం హీరోల్లో ఒక హీరో నచ్చడం అంటే అది మామూలు విషయం కాదు. నేటితరం హీరోల్లో కే.విశ్వనాథ్ గారు బాగా ఇష్టపడే హీరో ఎవరు? ఇదే ప్రశ్నకు గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో స్వయంగా సమాధానం ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.." ఈ తరం హీరోలలో ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటిస్తున్నారని, కానీ నాకు అందరికంటే జూనియర్ ఎన్టీఆర్ మరియు అల్లు అర్జున్ నటన బాగా నచ్చుతుందని.. అలా అని మిగిలిన హీరోలు బాగా చేయడం లేదని కాదని చెప్పుకొచ్చారు. ఈతరం హీరోల్లో తనకు నటనపరంగా ఎన్టీఆర్ అల్లు అర్జున్ చాలా ఇష్టమని గతంలో ఆయన పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి...!!