స్టైలిష్ లుక్ లో అనుపమ ఫొటోస్..!!

Divya
మలయాళం ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వర తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించింది. మొదట నితిన్ నటించిన అఆ చిత్రం తో తన సినీ కెరీర్ ని మొదలుపెట్టింది. ఆ తర్వాత శర్వానంద్ తో శతమానం భవతి చిత్రంలో నటించి సూపర్ హిట్టును తన ఖాతాలో వేసుకుంది. ఇటీవలే కార్తికేయ-2 ,18 తేజ సినిమాలలో నటించి మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులోపాటు తమిళ్, మలయాళం వంటి భాషలలో కూడా నటించి మంచి పాపులారిటీ అందుకుంది.
ప్రేమమ్ సినిమాతో మలయాళ ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. అక్కడ సూపర్ హిట్ కావడంతో అనుపమాకు తెలుగులో కూడా పలు సినిమాలలో నటించి మంచి క్రేజీ సంపాదించుకుంది. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ రావడంతో మలయాళం తమిళ్ భాషలలో కూడా మంచి అభిమానులను సొంతం చేసుకుంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ అభిమానులతో అప్పుడప్పుడు చిట్ చాట్ కూడా చేస్తూ ఉంటుంది. అలాగే తనకు సంబంధించిన ఫోటోలు విషయాలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా అనుపమ సంబంధించి కొన్ని ఫోటోలు షేర్ చేయగా అవి వైరల్ గా మారుతున్నాయి.

కర్లీ హెయిర్ తో ఉండే అనుపమ ఇప్పుడు తాజాగా సరికొత్త హెయిర్ స్టైల్ తో కనిపిస్తోంది. ఈ ఫోటోలో కాస్త డిఫరెంట్ లుక్ లో కూడా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. అనుపమ వేసుకున్న గౌన్ కి సైతం కాస్త షాక్ అవుతున్నారు.. మరి కొంతమంది ఏకంగా అను నువ్వేనా అంటూ .. దేవత ఇంత అందంగా ఉన్నావేంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక అనుపమ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ కావడం జరుగుతోంది. అనుపమ సినీ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డతో కలిసి డీజే టిల్లు -2 చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: