మెగా ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్.. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ..!

Divya

గత ఏడాది నుంచి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాల హవా కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే.  ముఖ్యంగా తమ అభిమాన హీరోల బ్లాక్ బస్టర్ సినిమాలను మళ్లీ థియేటర్లలో 4కె రూపంలో నిర్మాతల చేత విడుదల చేయిస్తున్నారు. ఇకపోతే డబుల్ బొనాంజా అన్నట్టుగా నిర్మాతలు కూడా స్టార్ హీరోల సినీ కెరియర్ లో బ్లాక్ బస్టర్గా నిలిచిన చిత్రాలను వారి పుట్టినరోజు సందర్భంగా లేదా ప్రత్యేకమైన దినాలలో రీ రిలీజ్ చేస్తూ ప్రాఫిట్ పొందుతున్నారు. ఇప్పటికే ప్రభాస్ ని మొదలుకొని మహేష్ బాబు,  చిరంజీవి , బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల సినీ కెరియర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రాలను రీ రిలీజ్ చేసి కలెక్షన్ల పరంగా మంచి వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే.
అయితే ఈ క్రమంలోని ఇప్పుడు మెగాస్టార్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చే న్యూస్ ఒకటి బాగా వైరల్ అవుతుంది. బాస్ ఇస్ బ్యాక్ అంటూ ఆయన నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాను రీ రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు . ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చిరంజీవి ఇప్పుడు మలయాళం సూపర్ హిట్ మూవీ వేదాళం రీమేకుగా భోళా శంకర్ సినిమాతో సమ్మర్ స్పెషల్ గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.  అయితే చిరంజీవి సినిమా రావడానికి ఇంకా మూడు నెలల సమయం పడుతుంది కాబట్టి ఆలోపు ఆయన సినిమా థియేటర్లలో ప్రదర్శించాలని అభిమానులు బాగా కోరుతున్నారట.
ఈ క్రమంలోని చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాను మళ్ళీ థియేటర్లలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారని సమాచారం.  1991లో చిరంజీవి , విజయశాంతి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాను ఇప్పుడు ఫిబ్రవరి 11వ తేదీన రీ రిలీజ్ చెయ్యనున్నారు.  విజయ్ బాపినీడు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మురళీమోహన్, ఆనంద్ రాజు,  రావుగోపాలరావు,  శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: