ఎన్టీఆర్ కోసం అదిరిపోయే ప్లాన్ వేసిన కొరటాల...!!
మరి rrr సినిమా విడుదల అవ్వక ముందు ఎన్టీఆర్ కొరటాలతో సినిమా ను కూడా ప్రకటించాడు.. ఈ కాంబోపై అప్పటి నుండి మంచి అంచనాలు కూడా ఏర్పడ్డాయి.. rrr విడుదల కాగానే ఈ సినిమా మొదలు అవుతుంది అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ భావించారు.. కానీ ఈ సినిమా వచ్చి కూడా ఏడాది అవుతున్నా కానీ కొరటాల-ఎన్టీఆర్ మూవీ స్టార్ట్ కాలేదు.. రోజులు గడుస్తున్న కూడా ఇప్పటి వరకు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళక పోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా తీవ్ర నిరాశ చెందుతున్నారు. అయితే కొరటాల శివ చాలా రోజుల వరకు స్క్రిప్ట్ కంప్లీట్ చేయక పోవడంతో ఈ సినిమా కాస్త ఆలస్యం అవుతూ వచ్చిందని తెలుస్తుంది.
ఇక ఇప్పుడు కొరటాల పక్క స్క్రిప్ట్ ను ఎన్టీఆర్ కు వినిపించి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నాడు.. ఈ సినిమా వచ్చే ఏడాది 2024లో ఉంటుంది అని ఫిబ్రవరి నుండి షూట్ స్టార్ట్ కాబోతుంది అని అధికారికంగా కూడా ప్రకటన వచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఈ నెలలో పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి నుండి స్టార్ట్ కానుంది అని సమాచారం... ఇదిలా ఉండగా ఫ్యాన్స్ ను హర్ట్ చేయకుండా కొరటాల ప్లాన్ చేసుకున్నాడు అని ఆరు నెలల్లోనే ఈ సినిమాను పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడని కూడా సమాచారం.. అంతేకాదు ఫ్యాన్స్ కోసం రెగ్యురల్ గా అప్డేట్ ఇస్తూ వారికీ చిరాకు కలిగించకుండా పక్కా ప్లాన్ చేసుకున్నాడు అని ఈ సినిమా 2024, ఏప్రిల్ 5న ఖచ్చితంగా విడుదల చేయనున్నారు అని తెలుస్తుంది.. ఇక ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ నిర్మిస్తుండగా.. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడనిసమాచారం.