టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి
జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
ఎన్టీఆర్ పోయిన సంవత్సరం విడుదల అయినటువంటి ఆర్ ఆర్ ఆర్
మూవీ తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇలా అదిరిపోయే రేంజ్ గుర్తింపును సంపాదించుకున్న
ఎన్టీఆర్ మరికొన్ని రోజుల్లో తన కెరీర్ లో 30 వ మూవీ గా రూపొందబోయే సినిమాలో
హీరో గా నటించబోతున్నాడు.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం
తమిళ సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయి రేంజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి వెట్రి మరన్ దర్శకత్వంలో రూపొందబోయే మల్టీ స్టారర్ స్టారర్ సినిమాలో
ఎన్టీఆర్ నటించిన బోతున్నట్లు తెలుస్తోంది. ఈ
మూవీ లో
ఎన్టీఆర్ తో పాటు మరో
తమిళ హీరో నటించబోతున్నట్లు , ఈ
మూవీ ని మైత్రి
మూవీ సంస్థ నిర్మించబోతున్నట్లు , అందులో భాగంగా ఇప్పటికే ఈ సంస్థ 5 కోట్ల రెమ్యూనరేషన్ ను కూడా వేట్రి మరన్ కు ఇచ్చినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ
మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.