చిరంజీవి గారి గొప్పదనం గురించి ఎంత చెప్పినా కూడా తక్కువ అవుతుందనే విషయం తెలిసిందే. చిత్ర పరిశ్రమలో ఇతరులకు సాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందువరసలో ఉండే హీరోగా చిరంజీవికి మంచి పేరుంది.
ఇతర హీరోలతో మరియు దర్శకులతో చిరంజీవికి మంచి అనుబంధం కూడా ఉంది. మెగాస్టార్ గ్రేట్ నెస్ గురించి పరిశ్రమలో కథలుకథలుగా చెప్పుకుంటారు. అయితే ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ చిరంజీవి గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు ను అయితే చేశారు.
చిరంజీవితో తనకు చనువుతో పాటు మంచి అనుబంధం కూడా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. రంగమార్తాండ మూవీకి వాయిస్ ఓవర్ చెప్పాలని మెగాస్టార్ చిరంజీవిని అడగాలంటే మొదట భయం వేసిందని కూడా ఆయన కామెంట్లు చేశారు. చిరంజీవి గారికి చెప్పగా చిరంజీవి వాయిస్ ఓవర్ అడగాలంటే ఎందుకు భయం అని అన్నారని కృష్ణవంశీ చెప్పుకొచ్చారట..
చిరంజీవి గారు ఒక శిఖరం అని చిరంజీవి గారి దగ్గర మన లిమిట్స్ లో మనం ఉండాలని కూడా ఆయన కామెంట్లు చేశారు. చిరంజీవి గారితో సినిమా చేయాలని అనుకున్నా కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదని కృష్ణవంశీ పేర్కొన్నారు. చిరంజీవి సినిమాలను ఆయన తప్ప ఎవరూ కూడా చేయలేరని మంచి కథ దొరికితే కనుక చిరంజీవి గారితో సినిమా చేయడానికి ముందు వుంటా ఆయన అని కామెంట్లు చేయడం విశేషం.
తరువాత రోజుల్లో చిరంజీవి కృష్ణవంశీ కాంబినేషన్ లో మూవీ వస్తుందేమో చూడాలి మరి.. చిరంజీవి అవకాశం ఇస్తే సినిమా చేయడానికి సిద్ధమేనని కూడా కృష్ణవంశీ చెప్పుకొచ్చారు. కృష్ణవంశీ ఒక్కో సినిమాకు 3 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అయితే తీసుకుంటున్నారు. రంగమార్తాండ సినిమా విడుదల తేదీకు సంబంధించి క్లారిటీ కూడా రావాల్సి ఉంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ ను వచ్చినట్లు తెలుస్తుంది.. చిరంజీవి ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. భోళా శంకర్ సినిమా ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కానున్నట్లు సమాచారం..