పాన్
ఇండియా స్టార్ అయిన
ప్రభాస్ బాహుబలి
సినిమా తో పాన్
ఇండియా స్టార్
హీరో గా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఆ
సినిమా తో దక్కిన గుర్తింపు ను
ప్రభాస్ ఉపయోగించు కునేందుకు సాధ్యమైనంత ఎక్కువగా భారీ చిత్రాలను అయితే చేసేందుకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నాడు
ఇప్పటికే
సాహో మరియు రాధేశ్యామ్ వంటి భారీ చిత్రాలను చేసిన
ప్రభాస్ తాజాగా ఆదిపురుష్
సినిమా ను చేసిన సంగతి తెలిసిందే.
హిందీ లో రూపొందిన ఆ
సినిమా టీజర్ విడుదల తర్వాత చిన్న పిల్లల
సినిమా అంటూ కూడా విమర్శలు ఎదుర్కొంది.
గ్రాఫిక్స్ విషయం లో
బాలీవుడ్ స్టార్స్ ఏ మాత్రం కూడా మన
టాలీవుడ్ రాజమౌళి రేంజ్ లో వర్క్ చేయలేక పోతున్నారంటూ కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆదిపురుష్
సినిమా లో కూడా
గ్రాఫిక్స్ విషయం లో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్న నేపథ్యం లో గత ఆరు నెలలుగా అదే పని లో మేకర్స్ ఉన్నారనీ తెలుస్తుంది.
ఇప్పటికే విడుదల అవ్వాల్సిన
సినిమా ను
గ్రాఫిక్స్ పేరు తో వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారనీ సమాచారం.. ఖర్చు భారీ గా పెడుతున్నా కానీ అవుట్ పుట్ మాత్రం సరిగా వస్తున్న దాఖలాలు అయితే కనిపించడం లేదట. అన్ని అనుకున్నట్లు జరిగితే ఇప్పటికే ఆదిపురుష్
సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి అయితే ఉంది. అయినా కూడా ఇంకా సరైన విడుదల తేదీ పై క్లారిటీ లేదు. ఇవన్నీ పరిస్థితులు చూస్తూ ఉంటే
ఆది పురుష్
సినిమా ప్రభాస్ ఇమేజ్ ని పెంచడం ఏమో కానీ డామేజ్ చేస్తుందేమో అనే ఆందోళన అభిమానుల్లో వ్యక్తం అవుతుంది. ఇప్పటికే చాలా వరకు
ప్రభాస్ అభిమానులు మాత్రం నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారనీ తెలుస్తుంది... గత చిత్రాల ఫలితాల విషయంలో
ప్రభాస్ అభిమానులు చాలా అసహనం తో ఉన్నారు. కనుక ఆదిపురుష్ ఫలితం మాత్రం ఎలా ఉంటుందనేది మరి చూడాలి.
ప్రభాస్ ఆదిపురుష్ మరియు సలార్ సినిమాలు పాన్
ఇండియా కెరీర్ ను నిర్ణయించబోతున్నాయి.