మరోసారి మంచి మనసు చాటుకున్న రామ్ చరణ్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్..!

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం నటన పరంగానే కాకుండా సామాజిక సేవలోనూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. తన తండ్రి లాగే కష్టాల్లో ఉన్న ఎంతోమందికి ఆదుకోవడంలో రామ్ చరణ్ ముందుంటున్నాడు. ముఖ్యంగా అభిమానుల విషయంలో ఎప్పుడూ ఒక్క అడుగు ముందుండే ఈ హీరో మరోసారి తన అభిమానిని కలిసి మంచి మనసుని చాటుకున్నాడు. తాజాగా రామ్ చరణ్ క్యాన్సర్ తో పోరాడుతున్న ఓ చిన్నారిని నేరుగా వెళ్లి కలిశారు. ఇక ఆ పూర్తి వివరాలకు వెళ్తే.. మణి కౌశల్ అనే చిన్నారి క్యాన్సర్ తో బాధపడుతున్నాడు.


అతడు రామ్ చరణ్ ని కలవాలని ఎప్పటి నుంచో ఆశ పడుతున్నాడు. అయితే ఈ విషయాన్ని రామ్ చరణ్ మేక్ ఏ విష్ అనే కార్యక్రమం ద్వారా తెలుసుకున్నాడు. వెంటనే ఆ చిన్నారి అభిమాని కోరికను తీర్చేందుకు నేరుగా అతని దగ్గరికి వెళ్ళాడు. క్యాన్సర్ తో పోరాడుతున్న ఆ చిన్నారికి కొండంత ధైర్యాన్ని ఇచ్చాడు రామచరణ్. అంతే కాదు కాసేపు అతనితో ముచ్చటించి సరదాగా గడిపాడు. అంతేకాదు తన చిన్నారి అభిమానికి ఓ బహుమతిని కూడా ఇచ్చాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వీటిని చూసి ఫాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు.


ముఖ్యంగా క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారి దగ్గరికి నేరుగా వెళ్లి అతనితో చాలా సేపు సమయాన్ని కేటాయించడంతో రామ్ చరణ్ చేసిన పనికి ఆయన ఫాన్స్, నెటిజన్ సైతం ఫిదా అవుతున్నారు. అంతేకాదు అభిమానుల విషయంలో రామ్ చరణ్ ఎప్పుడూ ముందుంటారని, దటీజ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.. దక్షిణాది సంచలన దర్శకుడు శంకర దర్శకత్వంలో 'ఆర్ సి 15' అనే భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సుమారు 200 కోట్ల భారీ వ్యయంతో ఈ సినిమాని నిర్మిస్తున్నాడు ప్రస్తుతం మీ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ కి జోడిగా కీయార అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది.ఇక ఈ సినిమాతో పాటూ బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ తన తదుపరి సినిమాని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: