పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కెరియర్ని ఊహించని మలుపు తిప్పిన సినిమాల్లో మిర్చి సినిమా కూడా ఒకటి. అప్పట్లో టాలీవుడ్ ని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది .అప్పటివరకు బోయపాటి శ్రీను వంశీ పైడిపల్లి లాంటి దర్శకులకు రచయితగా పనిచేసిన కొరటాల శివ మిర్చి సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రభాస్ కెరియర్ లోనే కమర్షియల్ సినిమాగా నిలిచింది ఈ సినిమా. బాహుబలి సినిమా కంటే ముందు ప్రభాస్ ఎన్నో అప్పులు ఉండేవాడు. ఇక ఆ అప్పులు తీర్చడానికి తన స్నేహితులతో కలిసి ఈ సినిమాను తీశాడు.
అంతేకాదు ప్రభాస్ కి ఈ సినిమాతో రెమ్యూనరేషన్ మాత్రమే కాకుండా లాభాల్లో వాటిల్లో కూడా బాగానే వచ్చాయి. అప్పట్లో ఫిబ్రవరి నెల సినిమాలకు సీజన్ కాదని చాలామంది అంటూ ఉండేవారు. ఇక అలాంటి ఫిబ్రవరి నెలలోనే ఈ సినిమాను విడుదల చేశారు. విడుదలైన ఆ రోజుల్లోనే ఈ సినిమా దాదాపు 50 కోట్లకు పైగా అన్ని షేర్ వసూళ్లను రాబట్టింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అదేంటి అంటే ఈ సినిమాని మొదట సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేయాలని అనుకున్నాడట కొరటాల శివ. అంతే కాదు ఈ క్రమంలోనే మహేష్ ని కలిసి ఈ సినిమా కథని కూడా చెప్పే ప్రయత్నం చేశాడట.
కానీ కొన్ని కారణాలవల్ల ఈ సినిమా చేయడం కుదరలేదు.దాని అనంతరం వంశీ కి ఈ సినిమా స్టోరీ లైన్ చెప్పిన వెంటనే కొరటాలని ప్రభాస్ దగ్గరికి తీసుకువెళ్లి మొత్తం కదా వినిపించారట. ఇక ప్రభాస్ కి స్టోరీ మొత్తం కూడా బాగా నచ్చడంతో ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడట. చెప్పిన వెంటనే ప్రభాస్కి కథనచడంతో ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ప్రభాస్. ఒకవేళ ఈ సినిమా ప్రభాస్ కాకుండా మహేష్ బాబు చేసి ఉంటే మహేష్ కి కలిసి వచ్చేదా లేదా తెలియదు గానీ... ఈ సినిమాకి ప్రభాస్ సరిగ్గా సెట్ అయ్యాడు ప్రభాస్. ఈ సినిమాకి మరే హీరో సెట్ అవ్వడు అన్న రేంజ్ లో ఈ సినిమా విజయాన్ని అందుకుంది!!.