టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీ 'శాకుంతలం' పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో రూపొందిన ఈ సినిమాని అగ్ర దర్శకుడు గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు. పాన్ ఇండియా స్థాయిలో గుణ టీం వర్క్స్ అండ్ దిల్ రాజు ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ సినిమాలో సమంత శకుంతల అనే పాత్రలో నటిస్తుండగా.. ఇక ఆమె సరసన మలయాళ అగ్ర నటుడు దేవ్ మోహన్ దుశ్యంతుడి పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల రెండుసార్లు వాయిదా పడింది.
మొదట గత ఏడాది నవంబర్ 4న ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేశారు.
కానీ ఎందుకో ఆ సమయానికి సినిమాని విడుదల చేయడం కుదరలేదు. ఆ తర్వాత మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 17వ తేదీన విడుదల చేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు. కానీ కొద్ది రోజుల క్రితం మరోసారి సినిమా విడుదలను వాయిదా వేసినట్లు అనౌన్స్ చేశారు. ఫైనల్ గా ఇప్పుడు శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా చిత్ర యూనిట్ ఓ సరికొత్త పోస్టర్తో లేటెస్ట్ రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇక అదే రోజు టాలీవుడ్ నుంచి మరో రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందులో అల్లరి నరేష్ 'ఉగ్రం' ఒకటి.. మరొకటి రాఘవ లారెన్స్ 'రుద్రుడు'.
ఈ రెండు సినిమాలతో పోటీగా శాకుంతలం కూడా ఏప్రిల్ 14న విడుదల కానుంది. అయితే మొదట ఈ విడుదల తేదీకి మెగాస్టార్ చిరంజీవి 'భోలా శంకర్' సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినా.. ఇప్పుడు మాత్రం దాన్ని వాయిదా వేశారు. దీంతో బోలా శంకర్ ప్లేస్ లో సమంత శాకుంతలం విడుదలవుతోంది. ఇక శాకుంతల విషయానికొస్తే.. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా మణిశర్మ మ్యూజిక్ అందించిన 'మల్లికా మల్లికా'.. 'ఏలేలో ఏలేలో', 'ఋషి వనములో' వంటి పాటలు శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమాతో పాటు సమంత విజయ్ దేవరకొండ సరసన 'ఖుషి' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఇప్పటికే రెండు భారీ షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది...!!