సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఒక సినిమా రానున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఎస్ ఎస్ ఎం బి 28 అని వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అతడు, ఖలేజా సినిమా తర్వాత వీరి కాంబినేషన్ లో రానున్న హ్యాట్రిక్ సినిమా ఇది. అయితే ఈ సినిమా పూర్తి అయిన వెంటనే మహేష్ బాబు తన కాల్ షీట్ మొత్తాన్ని కూడా రాజమౌళికే ఇచ్చేసాడు. త్రిబుల్ ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నానంతరం దర్శకత్వ రాజమౌళి మహేష్ బాబుతో ఒక సినిమా చేయనున్న సంగతి మనందరికీ తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి. భారీ బడ్జెట్ తో ఇండియన్స్ సిల్వర్ స్క్రీన్ పై ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాని ఒకసారి కొత్త కథ అంశంతో రాజమౌళి తీసుకురానున్నాడు. సౌత్ ఆఫ్రికాలోని అమెజాన్ అడవుల్లో బ్యాక్గ్రౌండ్ ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే చెప్పేశారు. వరల్డ్ అడ్వెంచర్ ట్రావెలర్ గా మహేష్ పాత్ర ఈ సినిమాలో ఉంటుందని తెలుస్తోంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి .అంతేకాదు క్యాస్టింగ్ కోసం హాలీవుడ్ కాస్టింగ్ ఏజెన్సీ తో రాజమౌళి ఇప్పటికే ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. దాంతో ఈ సినిమాలో టాలీవుడ్ నటీనటులు మాత్రమే కాకుండా హాలీవుడ్ నటులు కూడా ఉంటారని తెలుస్తోంది.
మాల్వేరి సిరీస్ లో నటించిన వారిని ఈ సినిమా కోసం రాజమౌళి ఎంపిక చేయనున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కోసం ఏకంగా 15 కోట్ల వరకు ఖర్చు చేశారని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ ఫైనల్ స్పీచ్ కి వచ్చింది. జూన్ లేదా జూలైలో లాంచింగ్ కూడా ఉంటుందని తెలుస్తుంది. అంతేకాకుండా లాంచింగ్ సందర్భంగా కాస్టింగ్ ఖరారు చేసే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోని ఈ సినిమాలో మహేష్ బాబుకి విలన్ గా కచ్చితంగా ఒక హాలీవుడ్ నటుడు ఉంటాడని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమాలో మహేష్ కి జోడిగా హీరోయిన్గా ఒక హాలీవుడ్ హీరోయిన్ ని కూడా ఎంపిక చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో దీపికా పడుకునే తో పాటు మరో హాలీవుడ్ హీరోయిన్ ని కూడా మహేష్ కి జోడిగా తీసుకురావాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది..!!