ఒక మనిషిని పోలిన మనుషులు ఈ ప్రపంచంలో ఏడుగురు ఉంటారు అని అంటూ ఉండడం మనం వింటూ ఉంటాం అయితే ఇది నిజమే. అచ్చం ఒకేలాగా ఉండకపోయినప్పటికీ 90% వరకు వ్యక్తులు చాలామంది ఒకేలా ఉంటారు. అయితే తాజాగా విడుదలైన కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమా కూడా నిజజీవితంలో జరిగిన ఒక సంఘటనను ఆధారంగా తీసుకొని చేసిన సినిమాని అని అంటున్నారు. అయితే మెక్సికో ప్రాంతంలో అచ్చం ఈ సినిమాలో లాగే ఒకే రూపంలో ఉన్న ముగ్గురూ వ్యక్తులు కలిసి ఉన్నారట. ఇక ఆ రోజుల్లో ఆ ముగ్గురు వ్యక్తులతో ఇంటర్వ్యూలో కూడా చేయడం జరిగింది. ఇక ఈ విషయం అప్పటిలో ఎంతలా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అయితే గతంలో జరిగిన ఆ సంఘటనని ఆధారంగా తీసుకొని చాలా సినిమాలు రావడం జరిగింది. అయితే తాజాగా ఇప్పుడు కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమా కూడా ఆ సంఘటనని ఆధారంగా తీసుకునే చేశారు అని అంటున్నారు. అయితే అచ్చం అలానే కాకుండా ఉన్నవి లేనట్టుగా కూడా కల్పించి ఒక పాత్ర నెగిటివ్గా ఈ సినిమాలో చూపించడం జరిగింది. అయితే మొదటిగా ఈ సినిమా చేయాలని ఆలోచన రావడానికి గల కారణం మెక్సికోలో ఉన్న ఆ ముగ్గురి వ్యక్తుల సంఘటన అని తెలుస్తుంది. అయితే కేవలం మెక్సికో మాత్రమే కాదు ఇలా మనుషులను పోలిన మనుషులు ప్రతి దేశంలోనూ ఉంటారు. దీన్ని ఆధారంగా తీసుకుని ఈ సినిమా కథను సిద్ధం చేశారు డైరెక్టర్ రాజేందర్ రెడ్డి.
ఈయనకి ఇదే మొదటి సినిమా అయినప్పటికీ ఏమాత్రం కన్ఫ్యూజ్ కాకుండా చాలా చక్కగా అర్థవంతంగా ఈ సినిమాను తీశారు.ఇటీవల కళ్యాణ్ రామ్ కెరియర్లో ఒక రేంజ్ లో కమర్షియల్ గా హిట్ అయిన బింబిసారా సినిమా లాగా ఈ సినిమా ఉంటుందని చెప్పలేము. కానీ ఈ సినిమా ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ మార్క్ ని అందుకుంటుంది అని అందరూ అంటున్నారు. నేటి జనరేషన్ హీరోలు ఎవరు కూడా ఒకేసారి మూడు పాత్రలో నటించే సాహసాన్ని చేయడం లేదు. ఇక అలాంటి హీరోలు ఉన్న ఈ జనరేషన్ లో నందమూరి కుటుంబానికి చెందిన వాళ్లు మాత్రమే ఇలాంటి సాహసాన్ని చేశారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ జై లవకుశ అనే సినిమాలో ఎంత అద్భుతంగా నటించడం మనందరికీ తెలిసిందే. అదే తరహాలో ఇప్పుడు కళ్యాణ్ రామ్ కూడా సినిమాలో అద్భుతంగా నటించి కమర్షియల్ గా మరొక హిట్టు మీ అందుకున్నాడు..!!.