ఆ సినిమా నా కెరీర్ లో టర్నింగ్ పాయింట్ : అల్లు అర్జున్

frame ఆ సినిమా నా కెరీర్ లో టర్నింగ్ పాయింట్ : అల్లు అర్జున్

murali krishna
మెగాస్టార్ చిరంజీవి సపోర్ట్ తో అల్లు అర్జున్ హీరోగా గంగోత్రి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఆ సినిమా కు ముందు విజేత మరియు డాడీ సినిమాల్లో కూడా అల్లు అర్జున్ కనిపించాడు.  గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ కూడా ఇచ్చాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి సినిమా మంచి విజయాన్ని అయితే సొంతం చేసుకుంది. అయితే మొదటి సినిమాలో నిక్కర్ వేసుకుని చిన్న పిల్లగాడిగా కనిపించడంతో హీరోగా అల్లు అర్జున్ కి రెండవ సినిమా అయిన ఆర్య మంచి కమర్షియల్ విజయాన్ని తెచ్చిపెట్టింది. ఆర్య సినిమా తర్వాత బన్నీ సినిమాను అల్లు అర్జున్ చేశాడు. ఆ సినిమా కూడా బన్నీ కోటి రూపాయల లోపు రెమ్యూనరేషన్ తీసుకున్నాడు.
బన్నీ తర్వాత హ్యాపీ సినిమాను అల్లు అర్జున్ చేశాడు. బన్నీ సినిమా వరకు కూడా కోటి రూపాయల లోపు పారితోషికం తీసుకున్న అల్లు అర్జున్ హ్యాపీ సినిమాకి భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుని ఉంటాడని అంతా కూడా అనుకుంటారు. కానీ హ్యాపీ సినిమా ను అల్లు అరవింద్ నిర్మించడంతో బన్నీకి రెమ్యూనరేషన్ గా ఇచ్చింది చాలా తక్కువేనని తెలుస్తుంది కనుక అల్లు అర్జున్ అధికారికంగా కోటి రూపాయలకు మించి పారితోషికం తీసుకున్న మొదటి సినిమా అయితే దేశముదురు. 2007 సంవత్సరంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో దానయ్య నిర్మించిన దేశ ముదురు సినిమాకు గాను అల్లు అర్జున్ కోటి రూపాయలకు మించి రెమ్యూనరేషన్ తీసుకున్నాడనీ తెలుస్తుంది.. మొదటిసారి అల్లు అర్జున్ దేశముదురు సినిమా తో కోటి రూపాయలు తీసుకున్న హీరోగా అయితే నిలిచాడు.
ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆ వెంటనే వచ్చిన పరుగు సినిమాకు ఏకంగా ఐదు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నాడని తెలుస్తుంది.. ప్రస్తుతం అల్లు అర్జున్ యొక్క రెమ్యూనరేషన్ పుష్ప 2 కి 100 కోట్లకు మించి రాబోతుంది అనే సంగతి తెలిసిందే. 2007 సంవత్సరంలో కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న అల్లు అర్జున్ 2023 వరకు ఏకంగా 100 కోట్ల రమ్యునరేషన్ స్థాయికి దిగాడు అంటూ ఆయన స్టార్ డం ఎక్కడి నుండి ఎక్కడికి చేరిందో  మనం అర్థం చేసుకోవచ్చు. మెగా ఫ్యామిలీకి చెందిన హీరో అయినప్పటికీ సొంతంగానే ఇమేజ్ పెంచుకున్నాడు.. అల్లు అర్జున్ ముందు ముందు మరింత భారీ విజయాలను సొంతం చేసుకుని సినిమాలను చేయడంతో పాటు పాన్ ఇండియా స్టార్ గా ఎదగాలని ప్రయత్నిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: