పుష్ప 2 తో రష్మికకు దెబ్బ పడిందా..?
పుష్ప-2 సినిమా లీకుల విషయంలో కూడా కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ.. మొదటి భాగాన్ని మించి రెండవ భాగాన్ని హైలైట్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ వంటి భాషలలో దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ సినిమాకి కూడా మంచి రెస్పాన్స్ లభించింది. ప్రపంచవ్యాప్తంగా రూ .350 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది. పుష్ప సినిమాలో క్యాస్టింగ్ నుంచి మూవీ టేకింగ్, స్క్రీన్ ప్లే , డైలాగులు నటీనటులు పర్ఫామెన్స్ ఒక్కొక్కటి ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి అని చెప్పవచ్చు.
సమంత స్పెషల్ సాంగ్ లో అదిరిపోయే స్టెప్పులు వేసింది. ఇక తాజాగా ఈ సినిమాలో జగపతిబాబు నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో యాంకర్ అనసూయ తో సుకుమార్ ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొదటి పాటలో నెగటివ్ రోల్ లో చూపించిన అనసూయ రెండో పాటనే స్పెషల్ సాంగ్లో చూపించబోతున్నారు. పుష్ప-2 లో రష్మిక పాత్ర చాలా తక్కువగా ఉంటుందని తెలుస్తోంది. కథ మొత్తం అల్లు అర్జున్ పైనే తిరుగుతుందట. రష్మిక పాత్ర తగ్గించడానికి కారణం బ్లీడింగ్ యాక్టర్లతో సరికొత్త పాత్రలను డిజైన్ చేయడమే అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.