టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు లవర్ బాయ్ గా మరియు స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు జగపతిబాబు. దాని అనంతరం కొన్ని ఫ్యామిలీ సినిమాలలో నటించి ఫ్యామిలీ ఆడియన్స్ తో ఒక ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇలాంటి ఒక స్టార్ హీరో ఒకప్పుడు మాత్రం చాలా దినమైన పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చిందని తెలుస్తుంది. అంతేకాదు జగపతిబాబు గతంలో తన బ్యాంకులో ఒక్క రూపాయి కూడా లేని పరిస్థితి నుండి నీ స్థాయికి వచ్చాడని తెలుస్తోంది. ప్రస్తుతం జగపతిబాబు నెగటివ్ పాత్రలో నటిస్తూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.
అలా నెగిటివ్ పాత్రలో నటిస్తూ కోట్ల ఆస్తులను కూడ పెట్టాడు జగపతిబాబు. అయితే తాజాగా అయిన పుట్టినరోజు సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఇంటర్వ్యూలో భాగంగా ఆయన ఆస్తుల గురించి పలు విషయాలను చెప్పుకొచ్చా డు జగపతిబాబు. తండ్రి సినిమాలలో ఒకప్పుడు దర్శకుడిగా నిర్మాతగా ఉండేవారు. ఇక ఆయన ఎవరో కాదు వివి రాజేంద్రప్రసాద్.ఇక జగపతి ఆర్ట్స్ బ్యానర్లు ఎన్నో సినిమాలను నిర్మించారు.ఆయన ఇక అదే బ్యానర్లో జగపతిబాబు కూడా హీరోగా ఇప్పటిదాకా సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ఇక గతంలో ఒకానొక సమయంలో జగపతి బాబు నటించిన వరుస ఏడు సినిమాలు కూడా భారీ డిజాస్టర్లుగా మిగిలాయి. దీంతో ఒక్కసారిగా ఆయనకున్న క్రేజ్ పడిపోయింది.
అంతేకాదు మార్కెట్ అమాంతం తగ్గిపోవడంతో కొన్ని అవమానాలను కూడా ఎదుర్కొన్నాడు జగపతిబాబు. ఒక్కొక్కసారి మరో హీరో సినిమాలో నటించేటప్పుడు సరిగా భోజనం కూడా దొరికేది కాదట .సెట్లో కూడా ఎవరూ గౌరవం ఇచ్చేవారు కాదట. అనంతరం చాలాకాలం ఇలాంటి పరిస్థితులని ఎదుర్కొన్నాడట జగపతిబాబు. ఇందులో భాగంగానే ఆయన మాట్లాడుతూ.. నాకు డబ్బు గురించి అసలు నాలెడ్జ్ లేదు.. ఒకప్పుడు నేను సంపాదించుకున్న ఆస్తులు లెక్క ప్రకారం చూస్తే ఇప్పటికే 1000 కోట్ల ప్రాపర్టీ నా దగ్గర ఉండాల్సింది.. ఇక ఆ డబ్బును అంతా కూడా నేను కేసీనులో పోగొట్టుకున్నాను.. నేను ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే ఆడతాను.. అది పేకాట లాంటి ఆట కాదు.. అది కూడా ఒక లిమిట్ మాత్రమే.. దానివల్ల డబ్బు పోలేదు.. డబ్బు విషయంలో నాకు జాగ్రత్త లేకపోవడమే ఇందుకు కారణం అని చేపలుకొచ్చాడు జగపతిబాబు..!!