ఆ పోస్ట్ తో విడాకులపై క్లారిటీ ఇచ్చిన మెగా అల్లుడు..!?

Anilkumar
మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పుడైతే ఈయన మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజను పెళ్లి చేసుకున్నాడు అప్పటినుండి ఈయన రేంజ్ మరింత పెరిగిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఎప్పుడైతే చిరంజీవి చిన్న కూతురు శ్రీజ నుంచి కళ్యాణ్ దేవి విడిపోయారు అంటూ సోషల్ మీడియా వేదికగా వార్తలు వచ్చాయో అప్పటినుండి ఈయన సిని కెరియర్ కూడా ముగిసింది అంటూ చాలామంది తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. అయితే గత కొద్ది రోజులుగా వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు అంటూ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వార్తలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 


ఈ వార్తపై ఎన్ని రోజులుగా వార్తలు వస్తున్నప్పటికీ మెగా ఫ్యామిలీ మాత్రం ఇప్పటివరకు ఈ విషయంపై స్పందించలేదు. దీంతో మెగా ఫ్యామిలీ స్పందించకపోవడంతో ఈ వార్తలు నిజమే అని అందరూ నమ్ముతున్నారు. అంతేకాదు కళ్యాణ్ దేవ్తో శ్రీజ విడాకులు తీసుకుందని మూడో పెళ్లికి కూడా సిద్ధమైంది అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు దీనికి తోడు సోషల్ మీడియాలో శ్రీజ కళ్యాణ్ దేవ్ పెడుతున్న కొన్ని పోస్టులు కూడా పెట్టడంతో ఈ వార్తలు నిజమే అని అందరూ నమ్ముతున్నారు. అయితే మొదట శ్రీజాతన సోషల్ మీడియా నుండి కళ్యాణ్ పేరును తొలగించింది. దీంతో వీరిద్దరి విడాకులకు సంబంధించిన రూమర్స్ బయటకు వచ్చాయి .


దీంతోపాటు కొన్నాళ్లుగా మెగా ఫ్యామిలీతో కళ్యాణ్ దేవ్ కనిపించడం లేదు .దీంతో ఈ వార్తలకి మరింత బలం వచ్చింది. అనంతరం వారిద్దరి మధ్య కొన్ని విభేదాలు వచ్చాయి అన్న వార్తలు ఎప్పుడైతే బయటికి వచ్చాయో అప్పటినుండి ఈ వార్తలన్నీ నిజమని మెగా అభిమానులు నమ్మడం మొదలుపెట్టారు. ఇక ఇలాంటి వార్తలు వచ్చిన అనంతరం కళ్యాణ్ దేవ్ రెండు సినిమాలు విడుదలయ్యాయి. ఇక ఆయన నటించిన ఈ రెండు సినిమాలను కూడా మెగా ఫ్యామిలీ ఎక్కడ కూడా ప్రమోట్ చేయకపోవడంతో ఈ వార్త నిజమే అని తెలుస్తోంది. ఇంతలా వీరిద్దరికీ సంబంధించిన వార్తలు సోషల్ మీడియా వేదికగా వస్తుంటే ..తాజాగా కళ్యాణ్ దేవతను సోషల్ మీడియా వేదికగా పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడూ వైరల్ అవుతుంది. ఫిబ్రవరి 11వ తేదీన తన కూతురు నవిష్క పుట్టినరోజు కావడంతో ఒక ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశాడు. ఈయన తన కూతురితో ఉన్న జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ మిస్సింగ్ యు అని క్యాప్షన్ కూడా పెట్టాడు .దీంతో వీరిద్దరి విడాకులకు సంబంధించిన వార్త మళ్ళీ తెరపైకి వచ్చింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: