నాని ఫస్ట్ టైం ‘దసరా’ లాంటి పాన్
ఇండియా సినిమా చేస్తున్నాడు. అయితే ఈ
సినిమా టీజర్ లాంచ్లో
నాని చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఒక రేంజిలో అయ్యాయి. ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీయఫ్’ సినిమాలతో
దసరా సినిమాని పోలుస్తూ ఇచ్చిన స్పీచ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.దీంతో నానిని అందరూ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకని ట్రోల్ చేశారు. అయితే దానికి
నాని బదులు ఇచ్చాడు.‘దసరా’
సినిమా రెండో పాట ‘ఓరి వారి’ రిలీజ్ ప్రెస్మీట్లో ఒక విలేకరి నానిని ‘ఇటీవల జరిగిన టీజర్ లాంచ్లో
ఆర్ఆర్ఆర్, కేజీయఫ్ సినిమాలతో
దసరా సినిమాని పోల్చారు. అయితే ఆ రేంజ్ హై బడ్జెట్ సినిమాలతో మీ సినిమాని ఎలా పోల్చారు?’ అని అడిగారు.దీనికి
హీరో నాని బదులిస్తూ...‘సోషల్ మీడియాలో దీనిపై వస్తున్న కామెంట్లకు కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి కదా.. ఒక్కోసారి మనం ఏదేదో అంటాం. ఇక దాన్ని 100 సార్లు కాపీ, పేస్ట్ చేసి ఇంకోలా రాస్తారు.
నేను పక్కా క్లియర్గా చెప్పేది ఏంటంటే...
ఆర్ఆర్ఆర్, కేజీయఫ్లాగా రూ. 500 కోట్లు లేదా రూ. 1000 కోట్లు వసూలు చేస్తాయా, ఆ సినిమాలంత బడ్జెట్ పెట్టి చేశామా అన్నది కాదు.’‘ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఆ సినిమాలో వాటి ఇండస్ట్రీలు గర్వించదగ్గ సినిమాలు. వాటి జోనరో, సీన్లు అలా ఉంటాయనో ఇంకా కథ వాటిలాగా ఉంటుందనో కాదు. అది చిన్న
సినిమా కావచ్చు లేదా పెద్ద
సినిమా కావచ్చు లేదా ఇంకా భారీ బడ్జెట్ పెద్ద
సినిమా కావచ్చు. అయితే కొన్ని ఆణిముత్యాలు ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా ఆయా ఇండస్ట్రీల నుంచి కొన్ని సినిమాలు వస్తాయి. ఈ
సినిమా మా
ఇండస్ట్రీ నుంచి వచ్చిందని జనాలు చాలా గర్వంగా చెప్పుకునే సినిమాలు అవి.అలా గత సంవత్సరం వచ్చిన సినిమాలు
ఆర్ఆర్ఆర్ ఇంకా కేజీయఫ్ అయితే ఈ సంవత్సరం మాత్రం తెలుగు
సినిమా నుంచి
దసరా వస్తుందని చెప్పాను.
మార్చి 30వ తేదీ దాకా అడిగిన ప్రతి సారీ ఇదే చెప్తాను.ఇక ఆ తర్వాత నేను చెప్పింది కరెక్టో కాదు మీరు చెప్పండి.’ అంటూ ఈ వివాదంపై
నాని బదులిచ్చారు.