మహేష్ ఫ్యాన్స్ ను కలవరపెడుతున్న త్రివిక్రమ్ వ్యహారశైలి !
పవన్ త్వరలో సెట్స్ పైకి తీసుకు వెళ్ళబోతున్న ‘వినోదయ సితం’ మూవీ రీమేక్ కు సంబంధించి త్రివిక్రమ్ సలహాలు ఆసినిమా స్క్రిప్ట్ మేకింగ్ పై ఉన్నాయి అంటూ ఇప్పటికే అనేక వార్తలు వచ్చాయి. ఈసినిమాలో పవన్ మానవ రూపంలో ఉండి కొన్ని అద్వితీయమైన శక్తులు కలిగిన పాత్రలో నటిస్తున్నాడు. గతంలో ‘గోపాల గోపాల’ మూవీలో కూడ పవన్ ఇలాంటి దేవుడు షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. అయితే ఆసినిమా పెద్దగా విజయవంతం కాలేదు.
దీనితో మళ్ళీ అలాంటి స్క్రిప్ట్ ను పవన్ కళ్యాణ్ పై మళ్ళీ ఎందుకు ప్రయోగిస్తున్నారు అంటూ పవన్ అభిమానులు త్రివిక్రమ్ పై కొంత అసహనంగా ఉన్నట్లు వార్తలు కూడ వచ్చాయి. ఇప్పుడు ఈవిషయాలు అన్నీ త్రివిక్రమ్ దృష్టి వరకు రావడంతో పవన్ అభిమానుల అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని ఈమూవీ కథలో చాల మార్పులు చేయడమే కాకుండా అనేక కమర్షియల్ ఎలిమెంట్స్ ను కూడ జత చేస్తున్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి ఈమూవీలో పవన్ పక్కన నటిస్తున్న సాయి తేజ్ కు పవన్ కలిపి ఒక పాటను పెట్టడమే కాకుండా తేజ్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఒక అందమైన అమ్మాయితో స్పెషల్ సాంగ్ ను క్రియేట్ చేసి కొన్ని సంవంత్సరాల క్రితం బాలీవుడ్ లో వచ్చిన ఒక మూవీలో అమితాబ్ అభిషేక్ ఐశ్వర్య చేసిన పాట మాదిరిగా ఈమూవీలో కూడ పవన్ సాయి తేజ్ మరో గ్లామర్ హీరోయిన్ మధ్య ఒక పాటను క్రియేట్ చేసారని తెలుస్తోంది. వాస్తవానికి ఈసినిమాకు డైలాగ్స్ వ్రాస్తున్నది బుర్రా సాయి మాధవ్ అయినప్పటికీ డైలాగ్స్ విషయంలో కూడ త్రివిక్రమ్ తన మార్క్ సలహాలను సాయి మాధవ్ కు ఇస్తూ ఎక్కడా పవన్ అభిమానులకు ఈమూవీ విషయంలో అసహనం కలగకుండా త్రివిక్రమ్ చాల వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి..