ఆ ప్రొడ్యూసర్ వల్లే.. ఇలియానా కెరియర్ నాశనమైందా?
అయితే సౌత్ లో ఈ అమ్మడు చేసిన సినిమాలు పెద్దగా ప్రేక్షకుల ఆదరణ పొందకపోవడంతో అవకాశాలు కూడా కనుమరుగైపోయాయి. అయితే ఇలియానా ఇక సౌత్‌లో సినిమాలు చేసి దాదాపు ఏళ్లు గడిచిపోతున్నాయి. ఎందుకు ఇలా ఇలియానా టాలీవుడ్‌కు దూరమైంది అంటే బాలీవుడ్ నుంచి ఆఫర్లు రావడం మళ్లీ ఇక టాలీవుడ్ ను పక్కన పెట్టేసింది అందరూ అనుకుంటారు. కానీ ఇలియానా కెరియర్ పూర్తిగా నాశనం కావడానికి ఇక టాలీవుడ్‌కు దూరం కావడానికి ఒక స్టార్ ప్రొడ్యూసర్ కారణమనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
రవితేజ హీరోగా తెరకెక్కిన దేవుడు చేసిన మనుషులు సినిమాలో రవితేజ సరసన నటించింది ఇలియానా. ఈ సినిమా సమయంలోనే కోలీవుడ్‌లో మరో మూవీ చేయాల్సి ఉందట. అందుకోసం స్టార్ ప్రొడ్యూసర్ దగ్గర 40 లక్షల వరకు అడ్వాన్స్ కూడా తీసుకుందట. కానీ ఇక ఆ సినిమా ఆగిపోయింది. దీంతో డబ్బులు వెనక్కి ఇచ్చేయాలని ప్రొడ్యూసర్ చెబితే ఇవ్వను అంటూ ఇలియానా చెప్పిందట. దీంతో సీరియస్ అయిన ప్రొడ్యూసర్ ఇలియానా పై నడిగర్ సంఘంతో పాటు సౌత్ ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ తో కంప్లైంట్ చేశాడు. ఫలితంగానే ఇక ఈ బ్యూటీ కి సౌత్ లో దర్శకులు పూర్తిగా దూరం పెట్టేసారట.