తారకరత్న కోసం ఆ సినిమా షూటింగ్ ఆపేసిన బాలయ్య..!?

Anilkumar
నందమూరి నటసింహ బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ స్పీడ్ గా దూసుకుపోతున్నాడు. ఇన్నాళ్ళ ఆయన సినీ కెరియర్లో ఆయన భారీగా రెమ్యూనరేషన్ పెంచింది లేదు .అఖండ సినిమా కంటే ముందు ఆయన వారితోషకం దాదాపు నాలుగు నుండి ఆరు కోట్ల మధ్యలోనే ఉండేది. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఇక బాలయ్య నటించిన ఖండా సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో వీర సింహారెడ్డి సినిమాకి 10 నుండి 12 కోట్ల వరకు బాలకృష్ణ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఇప్పుడు అనిల్ రావిపూడి మరియు బాలయ్య కాంబినేషన్లో వస్తున్న వస్తున్న సినిమాకి నాన్ థియేక్ట్రికల్ రైట్స్ లో కూడా బాలయ్య షేర్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. 

సాధారణంగా ఏ హీరో అయినా స్పీడుగా సినిమా చేసేస్తే నిర్మాతలకు ఎంతటి లాభం వస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాధారణంగా బాలకృష్ణ ఏ సినిమా నైనా చాలా త్వరగా పూర్తి చేస్తూ ఉంటాడు. సినిమా లేట్ అయితే ఏమవుతుందో అని ఆలోచించి త్వర త్వరగా సినిమాలు పూర్తి చేస్తాడు బాలకృష్ణ. ఈ క్రమంలోనే బాలకృష్ణ షూటింగ్ అప్డేట్ కోసం అడిగిన నిర్మాతలపై ఫైర్ అయ్యాడట బాలకృష్ణ .అంతేకాదు ఒక రేంజ్ లో వాళ్ళకి క్లాస్ తీసుకున్నట్లుగా కూడా సమాచారం. ప్రస్తుతం తారకరత్న హాస్పిటల్ లో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇటీవల ఆయనకి గుండెపోటు రావడం దాని నుండి ఇంకా కోలుకోకపోవడం బాలయ్యను నిద్ర లేకుండా చేస్తుంది అని అంటున్నారు.

అయితే ఎక్కువగా బాలయ్య తారకరత్న చికిత్స పొందుతున్న బెంగళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్ లోనే ఉంటున్నారని తెలుస్తోంది .ఈ నేపథ్యంలోనే అనిల్ రావిపూడి తో బాలకృష్ణ ఒక సినిమా చేయాల్సి ఉంది. సాధారణంగా షూటింగ్ ఎంత లేట్ చేస్తే నిర్మాతలకి అంత నష్టం వస్తుంది. ఈ నేపథ్యంలోనే సినిమా షూటింగ్ ఆలస్యం అవడంతో బాలయ్యకి ఫోన్ల మీద ఫోన్స్ చేస్తున్నారు సినీ నిర్మాతలు. ఇక అలా నిర్మాతలను బాలకృష్ణకి ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడంతో నన్ను డిస్టర్బ్ చేయకండి అని కాస్త కఠినంగా నిర్మాతలతో బాలకృష్ణ వ్యవహరించినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే బాలయ్య నిర్మాతలతో వ్యవహరించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారింది .అంతేకాదు బాలయ్య బిడ్డ తారకరత్న త్వరగా కోలుకోవాలని తారకరత్న కోసం బాలకృష్ణ మృత్యుంజయ హోమాలు సైతం చేస్తున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: