టాలీవుడ్ యంగ్
రెబల్ స్టార్ ప్రభాస్ కి దేశవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న
డార్లింగ్ ఆతిథ్యం ఇవ్వడంలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. సినీ ప్రముఖుల నుంచి అభిమానుల వరకు ప్రతి ఒక్కరికి తన ఇంటి వంటకాల రుచిని చూపించడం
ప్రభాస్ కు ఉన్న అలవాటు. అయితే
ప్రభాస్ ఆతిథ్యం గురించి ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోలు, హీరోయిన్లు పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. తాజాగా మన మిల్కీ
బ్యూటీ తమన్నా కూడా
ప్రభాస్ ఆతిథ్యానికి
ఫిదా అయిపోయింది. ఇదే విషయం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ
ప్రభాస్ ను పొగడ్తలతో ఆకాశానికెత్తేసింది.
తాజా ఇంటర్వ్యూలో
తమన్నా ప్రభాస్ గురించి మాట్లాడుతూ.."
ప్రభాస్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అతను తన ఇంటికి వచ్చిన గెస్ట్ లను ఎలా చూసుకుంటారో దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు. ఆయన భోజనానికి పిలిస్తే అందులో కనీసం 30 రకాల వంటకాలు కచ్చితంగా ఉంటాయి. అతను డబ్బుల గురించి ఆలోచించే వ్యక్తి కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే నిజంగా ఒక రాజు ఎలా ఉంటాడో
ప్రభాస్ ను చూస్తే తెలుస్తుంది. అభిమానులు అతన్ని ఎంతగా ఇష్టపడతారో తనకి తెలియదు. అంత పెద్ద స్టార్ అయిన అతను చాలా సింపుల్ గా ఉంటాడు" అంటూ
ప్రభాస్ పై పొగడ్తల వర్షం కురిపించింది తమన్నా. దీంతో
తమన్న చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్
మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
కాగా గతంలో
ప్రభాస్ ఆతిధ్యం గురించి
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్,
కోలీవుడ్ అగ్ర
హీరో సూర్య,
హీరోయిన్ పూజ హెగ్డే, శృతిహాసన్, శ్రద్ధ కపూర్ ఇలా చాలామంది చెప్పడం జరిగింది. ఈ సెలబ్రిటీస్ అంతా
ప్రభాస్ ఇంటి వంటకాలు వాటి రుచులు చూసి
ఫిదా అయిపోయారు. ఇక ఇప్పుడు
తమన్నా కూడా తాజాగా ఆ లిస్టులో చేరిపోయింది. ఇక
డార్లింగ్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్టు కే షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. వీటిలో సలార్ షూటింగ్ దశకు చేరుకుంది. సలార్ సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారు. అందులో మొదటి భాగం
సెప్టెంబర్ 28 నా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే దీనికంటే ముందే
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్లో
ప్రభాస్ నటించిన 'ఆది పురుష్'
జూన్ 16 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది...!!