చాలా ఏళ్ల తర్వాత సుమన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన చిరంజీవి..!?

Anilkumar
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. సినిమాల విషయంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన చుట్టూ జరుగుతున్న విషయాలను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటాడు మెగాస్టార్. మంచి విషయాలు వ్యక్తుల గురించి ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను బయటపడుతూ ఉంటాడు. అయితే తాజాగా సహనటుడు సుమన్ 45 సంవత్సరాల సినిమా ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా చిరంజీవి స్పందించడం జరిగింది. ఈ నేపథ్యంలోని ఒక స్పెషల్ వీడియోను కూడా చేసే తన సోషల్ మీడియా వేదికగా విడుదల చేశాడు మెగాస్టార్. 

ఇందులో భాగంగానే ఆయన మాట్లాడుతూ మై డియర్ సుమన్ 45 సంవత్సరాల సినిమా ప్రయాణం పూర్తి చేసుకున్నందుకు నీకు శుభాకాంక్షలు. పది భాషల్లో 500 కి పైగా సినిమాలలో నటించిన మీకు ఇది ఒక గొప్ప ఘనత. దాంతోపాటు విలక్షణమైన పాత్రలలో మీరు ఆకట్టుకున్నారు. అంతేకాదు మీకు హార్డ్ వర్క్ ఏంటో మీరు ఇప్పటిదాకా చేసిన సినిమాలే చెబుతాయి. అంతేకాదు మరిన్ని సంవత్సరాలు మీరు ఇలాగే వెండితెరపై కొనసాగాలని ఈ సందర్భంగా బెంగళూరులో ఫిబ్రవరి 16న ఏర్పాటు చేసిన అభినందన సభ విజయవంతం కావాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

 ఆ దేవుని కృప నీతో ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.అని సుమన్ కి శుభాకాంక్షలు తెలిపాడు మెగాస్టార్ చిరంజీవి .ఇదిలా ఉంటే ఇక చిరంజీవి మరియు దాదాపు ఒకే సమయంలో స్టార్ట్ అయింది. ఆ సమయంలో ఇద్దరు పోటాపోటీగా సినిమాలు చేసేవారు. ఇకపోతే తమిళనాడులో పుట్టిన సుమన్ తెలుగులో హీరోగా మంచు గుర్తింపును తెచ్చుకున్నాడు. 90 లలో ఆయన వరుస సినిమాల్లో నటించారు. అంతేకాదు తెలుగులో ఆయనకి చాలామంది వీరాభిమానులు కూడా ఉన్నారు. అనంతరం హీరోగా ఫెల్ అవుట్ అయిన తర్వాత ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు ఈయన. అనంతరం శంకర్ దర్శకత్వం వహించిన శివాజీ సినిమాతో పూర్తి స్థాయిలో ఈయన విలన్ గా మారాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: