ఆ పిలుపు వినలేనని.. కన్నీరు పెట్టుకుంటున్న బాలయ్య..!!
తారకరత్న మృతి అటు అభిమానులకు టిడిపి కుటుంబ సభ్యులకు తీరని లోటు అన్నట్లుగా తెలియజేస్తున్నారు. కటోరంగ మృత్యువుతో పోరాడుతూ మరణించిన తారకరత్న ఆత్మకు ఆ భగవంతుడు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని బాలకృష్ణ నివాళులు అర్పించారు. ఇక నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్రలో నందమూరి వారసుడు తారకరత్న కూడా పాల్గొనడం జరిగింది.ఇక ఈ పాదయాత్ర మొదటి నుంచి అన్ని తానే దగ్గరుండి చూసుకోవడం జరిగింది. అలా నారా లోకేష్ పాదయాత్రలో భాగంగా నిలిచిన తారకరత్న మొదటి రోజు గుండెపోటుతో కుప్పకూలడం జరిగింది.
ఆ వెంటనే అక్కడ దగ్గరలో ఉన్న ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ కి తరలించారు అక్కడే 23 రోజులపాటు మెరుగైన వైద్యం అందించారు.. ఇక చేసేది లేక విదేశీ వైద్యులను కూడా రప్పించి చికిత్స అందించారట కానీ తారకరత్న ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల కనిపించలేదని సమాచారం. ఇక నిన్నటి రోజున రాత్రి తారకరత్న మరణించారు ఈ విషయం తెలిసిన అటువంటి అభిమానులు సెలబ్రిటీల సైతం తారకరత్న మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. తారకరత్న నటించిన కొన్ని సినిమాలు త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నాయని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా అతి చిన్న వయసులోని తారకరత్న మరణ వార్త కుటుంబ సభ్యులను కలచి వేస్తోంది.