2024 లో పోటీకి సిద్ధమైన ఎన్టీఆర్-అల్లు అర్జున్..!!

Divya
టాలీవుడ్ లో స్టార్ హీరోలలో ఒకరైన అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఇద్దరు కూడా స్టార్ హీరోలే అని చెప్పవచ్చు పలు విభిన్నమైన కథలను ఎంచుకోవడంలో ముందు వరుసలో ఉంటారు. ఇక వరుస విజయాలతో దూసుకుపోతున్న సమయంలో తన తదుపరి చిత్రాలను కూడా అంతే విజయంగా అందుకోవాలని చూస్తున్నారు. rrr చిత్రంతో ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించగా అలాగే ఆస్కార్ బరీలో కూడా తన నటనతో నిలవడం జరిగింది. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప చిత్రంతో పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. రష్మిక కూడా పాన్ ఇండియా హీరోయిన్గా పేరు సంపాదించింది.

ఇలా ఇద్దరు హీరోలు కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే పేరు సంపాదించడంతో అభిమానులు కూడా కాస్త ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక తమ తదుపరి చిత్రాలను కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కించి విడుదల చేయాలని చూస్తున్నారు అలా ఎన్టీఆర్ 30వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్లో ఏప్రిల్ నెలలో విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. ఇందులో హీరోయిన్ గా జాన్వి కపూర్ నటిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఇక అల్లు అర్జున్ కూడా వచ్చే ఏడాది పుష్ప-2 చిత్రంతో సమ్మర్లోకి దిగబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఇదంతా ఇలా ఉండగా సమ్మర్లో వచ్చే ఏడాది మరింత రసవత్తంగా ఉంటుందని చెప్పవచ్చు. మరి ఇద్దరు పాన్ ఇండియా హీరోలు ఏ సినిమాలతో తమ అభిమానులను నేర్పిస్తారు అంటూ సినీ ప్రేక్షకుల సైతం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండు చిత్రాలు కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కించడం జరుగుతోంది. ఇక ఎన్టీఆర్ మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించేందుకు డైరెక్టర్ కొరటాల శివ కూడా ఎక్కువ సమయాన్ని తీసుకున్నారు. ఇక అల్లు అర్జున్ సినిమాని కూడా సుకుమార్ చాలా ప్రతిష్టాత్మకంగానే తెరకెక్కిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: