దర్శక ధీరుడు
రాజమౌళి తెరకెక్కించిన
rrr సినిమా తెలుగు సినిమాకే కాదు ఏకంగా
ఇండియన్ సినిమాకు కూడా ఎంతో మంచి పేరుని తెచ్చి పెట్టింది. ఇంకా అంతేకాదు ఈ
సినిమా కోసం పని చేసిన సాంకేతిక నిపుణలకు ఇంకా అలాగే నటులకు కూడా ఎంతో పాపులారిటీని సంపాదించి పెట్టింది.ఇంకా ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో యాక్ట్ చేసిన
ఎన్టీఆర్ రామ్ చరణ్ కి కేవలం పాన్
ఇండియా వైడ్ మాత్రమే కాదు వరల్డ్ వైడ్ గా అభిమానులు పెరిగారు. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు
హాలీవుడ్ సాంకేతిక నిపుణులు కూడా వీరిద్దరి నటనకి ఎంతగానో
ఫిదా అయ్యిపోతున్నారు.ఏ
ఇండియన్ యాక్టర్స్ కి దక్కని ఎన్నో గౌరవాలు వీరిద్దరికి దక్కుతున్నాయి. తాజాగా
రామ్ చరణ్ కి అలాంటి అరుదైన గౌరవం ఇప్పుడు దక్కింది.
హాలీవుడ్ లో నిర్వహించే HCA (హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్) అవార్డ్స్ లో
ఆర్ఆర్ఆర్ బెస్ట్
మూవీ, డైరెక్టర్, ఇంటర్నేషనల్
మూవీ ఇంకా అలాగే యాక్షన్ ఫిలిం విభాగాల్లో పోటీ చేస్తుంది. ఈ నెల 24 వ తేదీన బెవర్లీ హిల్స్ లో ఈ అవార్డుల వేడుక జరగబోతుంది.
కాగా ఈ అవార్డుల పురస్కారానికి మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ ని HCA ప్రజెంటర్ గా ఆహ్వానించింది. విజేతగా ఇందులో నిలిచిన వారు మన మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ చేతులు మీదగా అవార్డు అందుకోనున్నారు. ఈ ఘనత అందుకున్న తొలి హీరోగా మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ రికార్డ్ క్రియేట్ చేశాడు.ఇంకా అలాగే ఈ అవార్డులతో పాటు
ఆస్కార్ వేడుకల్లో కూడా పాల్గొడానికి
రామ్ చరణ్ అండ్
rrr టీం
అమెరికా బయలుదేరారు.
ఫిబ్రవరి 20 వ తేదీన రాత్రి
రామ్ చరణ్ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరాడు. అందుకు సంబంధించిన వీడియోలు ఇంకా ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మార్చి 13 వ తేదీన
ఆస్కార్ అవార్డులు వేడుక జరుగనుంది. కాగా నాటు నాటు సాంగ్
ఆస్కార్ గెలుచుకోవడంలో సందేహం లేదు అంటున్నాయి
హాలీవుడ్ మీడియా వర్గాలు. ఇప్పటికే ఈ పాట పలు
అంతర్జాతీయ అవార్డులని అందుకోవడమే కాకుండా,
ఆస్కార్ తరువాత ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డుని కూడా అందుకొని సరికొత్త చరిత్రని సృష్టించింది.