ఎన్టీఆర్ అందుకే ఆ టీవి షోలకి రావడంలేదా..!?

Anilkumar
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తేరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమా సక్సెస్ అనంతరం మీడియాకు దూరంగా ఉంటున్నారు జూనియర్ ఎన్టీఆర్. అంతేకాదు టాక్ షోలో కూడా ఎక్కడ కనిపించడం లేదు. దీంతో ఈ విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారుతుంది. అన్ స్టాపబుల్ షో కి జూనియర్ ఎన్టీఆర్ వస్తారు అని అందరూ భావించారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ రాలేదు. దీంతో టాక్ షోలకి రావడం జూనియర్ ఎన్టీఆర్కి ఇష్టం లేదు అంటూ ప్రచారం జరుగుతుంది. అంతేకాదు బాలకృష్ణకు మరియు జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య గ్యాప్ ఉందని అందుకే ఆయన షో కి తారక్ రావడం లేదు అని కొంతమంది అంటున్నారు. 

మరి కొంతమంది ఆహ్వానం అందకుండా షోకి ఎలా వస్తారు అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. అంతేకాదు ఇటీవల ప్రారంభమైన మరొక టాక్ షో అయినా నిజం విత్ స్మిత అనే టాక్ షో కి కూడా జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు రాలేదు. ఇప్పటికే ఈ షో కి సంబంధించి విడుదలైన ప్రోమోల ద్వారా ఈ షో కి ఎంతమంది సెలబ్రిటీలు హాజరయ్యారో స్పష్టమవుతుంది. ఈ క్రమంలోనే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇలాంటి టాక్ షోలకు రావడం జూనియర్ ఎన్టీఆర్కి ఇష్టం లేదని అందుకే షోలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. అంతేకాదు ఒకవేళ షోలకి హాజరైతే తన సినిమాలకి సంబంధించిన విషయాలను చెప్పవలసి వస్తుందని అందుకే తారక్ రావడం లేదని అంటున్నారు.

 సాధారణంగా ఆయన చేసే సినిమాలను రిలీజ్ కావడానికి చాలా సమయం పడుతుందని అందుకే ఆ విషయాలను రివిల్ చేయడం జూనియర్ ఎన్టీఆర్కి ఇష్టం లేదని అందుకే షోలకి రావడం లేదని జోరుగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మరొకవైపు జూనియర్ ఎన్టీఆర్ పార్టీ సినిమా విడుదల సమయంలోనే టీవీ షోలలో ఓటీపీ షోలలో మనిద్దరి షోలలో వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుందని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ మరియు జాహ్నవి కాంబినేషన్లో వచ్చే కొన్ని సీన్లు చాలా అద్భుతంగా ఉంటాయని కూడా అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: