కమల్, విక్రమ్ బాటలోనే సూర్య.. తన నెక్స్ట్ సినిమాలో?
ఈ విషయంలో లోకనాయకుడు కమలహాసన్ తో పాటు మరో స్టార్ హీరో విక్రమ్ బాటలోనే సూర్య కూడా అడుగులు వేస్తున్నాడు అన్నది తెలుస్తుంది. వారి మాదిరిగానే ఒకే సినిమాలో డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నాడట సూర్య. పిరియాడిక్ ఎపిక్ యాక్షన్ జానర్ లో ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో సూర్య ఏకంగా ఐదు డిఫరెంట్ పాత్రలలో ప్రేక్షకులను పలకరించబోతున్నాడట. అంతేకాదు ఇక ఈ సినిమాను ఏకంగా 10 భాషలలో రిలీజ్ చేయాలని సూర్య భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకి వీర్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారట చిత్ర బృందం. ఇక ఈ మూవీ 1678 కాలంలో జరిగే కథ ఆధారంగానే తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది. సూర్య ఈ సినిమాలో యోధుడిగా కనిపించబోతున్నాడట. అయితే అలెగ్జాండర్ కథతో ఈ సినిమా లింక్ అయి వస్తుందని మరి కొంతమంది కూడా అంచనా వేస్తూ ఉన్నారు. అయితే సాధారణంగానే ఏదైనా పాత్రలో సూర్య నటించాడు అంటే చాలు ఆ పాత్రకి ప్రాణం పోస్తూ ఉంటాడు. అలాంటిది ఐదు విభిన్నమైన పాత్రలో నటిస్తున్నాడు అని తెలియడంతో సూర్య నట విశ్వరూపం చూడటం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు అని చెప్పాలి.