రామ్ చరణ్ మగధీర రీ రిలీజ్.. ఎప్పుడంటే..?
ఇకపోతే ప్రస్తుతం రీ రిలీజ్ సినిమాల హవా జరుగుతున్న నేపథ్యంలో 13 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 17వ తేదీన ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు మేకర్స్. మరొకసారి కాలభైరవ - మిత్రవిందల ప్రేమ కథ థియేటర్లలో చూడడానికి ప్రేక్షకులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మిత్రవిందా పాత్రలో చాలా అద్భుతంగా ఒదిగిపోయి మరీ నటించింది. అల్లు అరవింద్ నిర్మాణంలో దర్శకుడు రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో నటుడు శ్రీహరి కీలకపాత్ర పోషించారు. ఇకపోతే ఈ సినిమాకు కథను డైరెక్టర్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందించిన విషయం అందరికీ తెలిసిందే.
ఇకపోతే దాదాపు 13 ఏళ్ల క్రిందటి ఈ సినిమా రూ. 45.42 కోట్ల థియేటర్లు బిజినెస్ చేయగా.. మొత్తంగా రూ.77.96 కోట్ల షేర్ వసూలు రాబట్టి రికార్డు సృష్టించింది. ముఖ్యంగా బయ్యర్లకు రూ.37.54 కోట్ల భారీ లాభాలను అందివ్వడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ చిత్రాన్ని మరోసారి థియేటర్లలో విడుదల చేయబోతుండడంతో ప్రతి ఒక్కరు ఇప్పుడు మరెంత రాబడుతుంది అనే విషయంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.