టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ప్రజెంట్ ఫుల్ ఫామ్ లో ఉంది. ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది. ఇక ఇప్పుడు ఇదే ఏడాది మరో భారీ ప్రాజెక్టుతో అలరించబోతోంది. ఆ ప్రాజెక్ట్ పేరే సలార్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమా ఇది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ కథానాయకగా నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాలోని తన షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయినట్లు శృతిహాసన్ వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ కూడా పెట్టింది.
ఈ పోస్టులో సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అలాగే సినిమాటోగ్రాఫర్ భువన గౌడ్ తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ తనను సలార్ సినిమాలో భాగం చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నిల్, ప్రభాస్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. ఇక శృతిహాసన్ తన పోస్టులో పేర్కొంటూ.." సలార్ సినిమాలో నా షూటింగ్ భాగం పూర్తయింది. ఆద్య అనే రోల్ లో ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రశాంత్ సార్ మీకు చాలా థాంక్స్. మీరు అసాధారణమైన వారు. థాంక్యూ ప్రభాస్ మీతో నటించడం నాకెంతో అద్భుతంగా ఉంది. నిజంగా మీరు డార్లింగ్. హోంభలే ఫిలిమ్స్ టీమ్ అందరితో కలిసి పనిచేయడం చాలా ప్రత్యేకంగా ఉంది. మీరందరూ నన్ను ఫ్యామిలీ మెంబర్ లా చూసుకున్నారు" అంటూ శృతిహాసన్ తన ఇన్స్టాగ్రామ్ లో పేర్కొంది.
కాగా ఈ సినిమాలో శృతిహాసన్ ఓ జర్నలిస్టుగా కనిపించబోతోంది. సినిమాలో తన పాత్రకు కూడా ఎంతో ఇంపార్టెన్స్ ఉందని అంటున్నారు. ఇక సలార్ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి దశకు చేరుకుంది. ఇప్పటికే 90 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం. హోం బలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో మలయాళ అగ్ర నటుడు పృధ్వీరాజ్ సుకుమారన్, సీనియర్ నటి జగపతిబాబు విలన్స్ గా కనిపించనున్నారు. ఇక సలార్ రెండు భాగాలుగా ఉంటుందని ఇప్పటికే వార్తలు వినిపించాయి. కానీ దీనిపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. రవి బసూర్ సంగీతమందిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది..!!