ఓటీటీ లో దుమ్ము రేపుతున్న వీరసింహారెడ్డి...!!

murali krishna
బాలయ్య నటించిన వీరసింహారెడ్డి థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా ఓటీటీలో కూడా ఈ సినిమా సంచలనాలు సృష్టించడం విశేషం. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో వీరసింహారెడ్డి మూవీ స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.వీరసింహారెడ్డి సినిమాలో శృతి హాసన్ మరియు హనీ రోజ్ హీరోయిన్లుగా నటించడం గమనార్హం. తెలుగుతో పాటు ఇతర ప్రధాన భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోందని తెలుస్తుంది.

అయితే వీరసింహారెడ్డి మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కావడం తో పాటు అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకుందని తెలుస్తుంది.. ఈ సినిమా స్ట్రీమింగ్ స్టార్ట్ అయిన మొదటి నిమిషంలోనే 1,50,000 యూనిక్ వ్యూస్ ను సొంతం చేసుకుందట.. ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఏ స్థాయి లో ఎదురు చూసారో ఈ రికార్డ్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఈ సినిమా వల్ల డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కు సబ్ స్క్రైబర్ల సంఖ్య కూడా ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కగా థమన్ ఈ సినిమాకు సంగీతం అందించిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో సాంగ్స్, బీజీఎం వేరే లెవెల్ లో ఉంటాయనే విషయం తెలిసిందే. బాలయ్య శృతి హాసన్ జోడీకి కూడా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు కూడా దక్కాయి. దర్శకుడిగా గోపీచంద్ మలినేని రేంజ్ ను ఈ సినిమా ఎంతగానో పెంచిందని చెప్పొచ్చు.కర్నూలు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఫ్యాన్స్ కు బాగా నచ్చేసింది.

ఈ సినిమాలోని అన్ని పాటలు కూడా మంచి హిట్టయ్యాయి. జై బాలయ్య, సుగుణ సుందరి మరియు మాస్ మొగుడు సాంగ్స్ ప్రేక్షకులను అంచనాలను మించి మెప్పించడం విశేషం.. అదిరిపోయే కలెక్షన్స్ సాధించి బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్ట్ చేసిన సినిమాగా నిలిచిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: