ఐటెం సాంగ్స్ కోసం వారిని సంప్రదిస్తున్న త్రివిక్రమ్.. వర్కౌట్ అవుతుందా?

Divya
సాధారణంగా గతంతో పోల్చుకుంటే ఇటీవల కాలంలో చాలామంది హీరోయిన్లు స్టార్ స్టేటస్ పొందినప్పటికీ కూడా పారితోషకం కోసం ఐటమ్ సాంగ్స్ లో నటించడానికి కూడా వెనుకడుగు వేయడం లేదు. మరి కొంతమంది వ్యాంపు క్యారెక్టర్లు పోషించడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు క్యారెక్టర్ ను బట్టి సినిమాకు, తమ కెరియర్ కు ప్లస్ అవుతుంది అంటే తండ్రి కొడుకులతో నటించడానికి కూడా ముందుకొస్తున్నారు ఈ క్రమంలోనే చాలామంది ఐటమ్ సాంగ్స్ లో నటిస్తూ భారీ పాపులారిటీ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పూజా హెగ్డే, సమంత, రష్మిక మందన్న ఇలా చాలామంది ఐటమ్ సాంగ్స్ లో మెరిసిన వారే.

ఇదిలా ఉండగా తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరు స్టార్ హీరోయిన్లను ఐటమ్ సాంగ్  కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబుతో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.  త్వరలోనే ఈ సినిమా పూర్తి చేసి ఆగస్టు నెలలో విడుదలకు సిద్ధం చేయాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో భూమి పడ్నేకర్,  శ్రీ లీల,  పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే . ఇకపోతే ఈ సినిమాకి  సంబంధించి మొదటి షెడ్యూల్ పూర్తయింది.  ఇప్పుడు రెండవ షెడ్యూల్ కూడా జరుగుతుంది.  ఇందులో భాగంగానే ఐటమ్ సాంగ్ కూడా ఈ సినిమాలో పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఐటెం సాంగ్ కోసం శృతిహాసన్ , కాజల్ అగర్వాల్ ను  త్రివిక్రమ్ సంప్రదించినట్లు సమాచారం.  మరి వీరిద్దరిలో ఎవరో ఒకరు ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి ఒప్పుకుంటే సినిమా మరో స్థాయికి వెళ్తుందనే ఆలోచనలో ఉన్నారట త్రివిక్రమ్. మరి త్రివిక్రమ్ ఆలోచన మేరకు కాజల్ లేదా శృతిహాసన్ ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ఐటమ్ సాంగ్ లో మెరిసే అవకాశం కనిపిస్తోంది.  ఇకపోతే మహేష్ బాబు సినిమా ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కపోతోంది.  కాబట్టి ఇందులో ఎవరు నటించినా సరే వారికి పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ లభించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: