SSMB 28 కొత్త షెడ్యూల్ షురూ..!

Divya
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి తెలుగు సినీ ప్రేక్షకులకే కాదు ఇప్పుడు యావత్ దేశ ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ ని మొదలుకొని బాలీవుడ్ వరకు ప్రతి ఒక్కరు కూడా మహేష్ బాబు కోసం ఆయన సినిమాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే సర్కారు వారి పాట తర్వాత ఎప్పుడో తన 28వ చిత్రాన్ని తెరకెక్కించాల్సి ఉండగా మధ్యలో అనుకోని విధంగా తల్లి ఇందిరాదేవి, తండ్రి కృష్ణ ఇద్దరూ కూడా కొన్ని రోజుల వ్యవధిలోనే స్వర్గస్తులవడం ఆయనను జీర్ణించుకోలేకపోయేలా చేసింది.
ఇకపోతే అప్పటినుంచి ఆయన తన తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు.  ఆ తర్వాత కొంతకాలానికి మాటల మాంత్రికుడు త్రివిక్రంతో SSMB28 వర్కింగ్ టైటిల్ తో తన తదుపరి చిత్రం ఉంటుందని స్పష్టం చేశాడు.  ఈ క్రమంలోనే మొదటి షెడ్యూల్ కూడా పూర్తయింది మొన్నటి వరకు రెండవ షెడ్యూల్ ని కూడా పూర్తి చేశారు. తాజాగా ఇప్పుడు కొత్త షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో పూజా హెగ్డే, శ్రీ లీలా తో పాటు భూమి పడ్నేకర్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక అంతేకాదు ఈ సినిమాలో ఐటెం సాంగ్ కూడా ఉండబోతుందని త్రివిక్రమ్  ప్రకటించిన విషయం తెలిసిందే.  అయితే కాజల్ అగర్వాల్ లేదా శృతిహాసన్ పేర్లు ఇప్పుడు పరిశీలనలో ఉన్న నేపథ్యంలో ఇద్దరిలో ఎవరో ఒకరు ఇందులో ఐటెం సాంగ్ లో నర్తించే అవకాశం ఉంది.
ఇకపోతే ఈ రోజు నుంచి ఈ సినిమా షెడ్యూలు ప్రారంభం కానున్న నేపథ్యంలో..పూజా హెగ్డే, శ్రీ లీల మరియు చాలా మంది తారాగణం ఈ సుదీర్ఘ షెడ్యూల్‌లో భాగం కానున్నారు. ఇక ఈ సినిమా ను  ఆగస్ట్ 11, 2023న విడుదల చేయాలని టీమ్ ఆలోచిస్తుంది. మొత్తానికి అయితే ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్లో చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: