టాప్ సెలబ్రిటీలు కూడా ఎన్టీఆర్ ను పట్టించుకోవడం లేదా..?

Divya
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నందమూరి వారసుడిగా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాల రామాయణం సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ దక్కించుకున్నారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ స్థాయిలో పాపులారిటీ అందుకున్న ఎన్టీఆర్ ఈ సినిమాకు మూల స్తంభంగా నిలిచారని చెప్పవచ్చు. మరొకవైపు అంతే దీటుగా రాంచరణ్ కూడా తన నటనతో మెప్పించారు. తాజాగా ఈ సినిమాలో తమ నటనతో ప్రపంచ స్థాయిలో హాలీవుడ్ దిగ్గజాలుగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకులు, నిర్మాతలు, నటీనటులు కూడా వీరి నటనకు ఫిదా అయిపోయారు.
అంతేకాదు టామ్ క్రూజ్ వంటి హాలీవుడ్ దిగ్గజ నటులతో కూడా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు కోసం పోటీ పడుతున్నారు అంటే ఇక ఏ రేంజ్ లో వీరు తమనుటలతో ప్రేక్షకులను మెప్పించారో అర్థం చేసుకోవచ్చు. ఇక నిన్నటికి నిన్న అమెరికాలో జరిగిన ఆరవ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ ఫంక్షన్ కి రాంచరణ్ కు ఆహ్వానం అందగా ఆయన అక్కడ.. గుడ్ మార్నింగ్ అమెరికా టాక్ షోలో పాల్గొని ఎన్టీఆర్ గురించి చాలా గొప్పగా చెప్పడమే కాకుండా తన సోదరుడు అంటూ చెప్పి అందరిని సంతోషానికి గురి చేశారు.
కానీ తాజాగా ఆనంద్ మహేంద్ర చేసిన ట్వీట్ ఇప్పుడు నందమూరి అభిమానులను మరింత కలవరపెడుతోంది. ఆయన రామ్ చరణ్ కు మంచి స్నేహితుడే కాదు వీరాభిమాని అని కూడా అందరికీ తెలుసు.  ఈ క్రమంలోని ఎన్టీఆర్ను కూడా కాదని మెగా ఫ్యామిలీని ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేస్తున్నారు.  చిరంజీవి ఫస్ట్ ఆ తర్వాత పవన్ కళ్యాణ్..తర్వాత రామ్ చరణ్ అంటూ వీరినే బెస్ట్ యాక్టర్స్ గా ఆయన ప్రకటించారే కానీ అంతకంటే సూపర్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ ని మాత్రం ఆయన ప్రస్తావించకపోవడంతో అభిమానులు పూర్తిస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు.  ఆనంద్ మహీంద్రా పై ఆగ్రహంతో ట్రీట్లు చేస్తున్నారు మరి ఈ విషయంపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: