ఏ మాయ చేసావే సినిమా ద్వారా ఒకరికొకరు పరిచయమయ్యారు నాగచైతన్య మరియు సమంత. ఇక ఆ సినిమాలో వారిద్దరికీ ఏర్పడిన స్నేహం వల్ల ప్రేమలో పడ్డారు వీరిద్దరూ. చాలా ఇల్లు వీరిద్దరి ప్రేమను సీక్రెట్ గా ఉంచి అనంతరం కుటుంబ సభ్యులకి చెప్పి ఈ కుటుంబ సభ్యుల ఒప్పందంతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. గోవాలో వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే అప్పట్లో వీరిద్దరి పెళ్లి ఎంతలా హాట్ టాపిక్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెళ్లయిన అనంతరం ఇండస్ట్రీలోని క్యూటెస్ట్ కపుల్ గా కూడా వీరిద్దరూ మంచి పేరును తెచ్చుకున్నారు.
ఇక అలా మంచి పేరును తెచ్చుకున్న ఈ జంట కనీసం నాలుగు సంవత్సరాలు కూడా కలిసి ఉండలేదు. కొన్ని రోజుల అనంతరం కొన్ని మనస్పర్ధలు వల్ల విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించి ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చారు. ఎప్పుడైతే వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నాము అని అధికారికంగా ప్రకటించారో ఆ విషయం వినగానే అందరూ షాక్ అయ్యారు. పెళ్లయి కనీసం నాలుగు సంవత్సరాలు కూడా కలిసి ఉండకుండానే విడాకులు తీసుకుని ఎవరి జీవితాలలో వారు ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఇక వీరిద్దరూ కలిసి నటించిన maya CHESAVE' target='_blank' title='ఏం మాయ చేసావే-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఏం మాయ చేసావే సినిమాకి నిన్నటితో 13 సంవత్సరాలు పూర్తయ్యాయి.
ఈ క్రమంలోనే ఈ సినిమా 13 సంవత్సరాలు పూర్తి చేసుకున్న క్రమంలో నాగచైతన్య తన సోషల్ మీడియా వేదికగా ఏ మాయ చేసావే సినిమాకి సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేశాడు. సినిమాకి సంబంధించిన ఫోటోనే కాకుండా నాగచైతన్య మరియు సమంత ఇద్దరు కలిసి ఉన్న ఒక ఫోటోని కూడా షేర్ చేయడం జరిగింది. కానీ సమంత మాత్రం ఆ సినిమాకి సంబంధించిన ఒక ఫోటోని కూడా తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయలేదు. నాగచైతన్య మొదటిసారి విడాకుల తర్వాత సమంత మరియు తాను ఇద్దరు కలిసి ఉన్న ఫోటోను షేర్ చేయడంతో నాగచైతన్య ఇంకా సమంతని మర్చిపోలేదేమో అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి..!!