ఎన్టీఆర్ కొరటాల శివ ను పక్కకు పెడుతున్నారా..?

Divya
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన అతి తక్కువ సమయంలోనే తాతకు తగ్గ మనవడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ ఏ సినిమాలో నటించిన సరే ప్రతి సినిమాకు తన మేకోవర్ ను మార్చుకుంటూ ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. అందుకే ఆయన నటనకు , డాన్స్ కు , మాస్ క్లాస్ పర్ఫామెన్స్ కు ఫిదా అవ్వని అభిమానులు ఉండరు అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో గత ఏడాది వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు.
అంతేకాదు ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జపాన్ భాషలోనూ అలాగే అమెరికా యాక్సెంట్ లో కూడా మాట్లాడి అక్కడివారిని తెగ ఆకట్టుకున్న ఎన్టీఆర్ అందరి ఆల్ టైం ఫేవరెట్ హీరోగా మారిపోయారు.  ఇదిలా ఉండగా.. ఆర్ఆర్ఆర్ సినిమా గత ఏడాది మార్చిలో విడుదలైనప్పటికీ ఆ తర్వాత ఎన్టీఆర్ తనకు సంబంధించిన ప్రాజెక్టును ప్రకటించలేదు.  కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారనే వార్త వినిపించింది కానీ అందుకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు మాత్రం ఇంకా పూర్తి అవ్వలేదనే వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కొరటాల శివా రెడీ చేసిన స్క్రిప్ట్ ఎన్టీఆర్ కి సంతృప్తికరంగా లేదు అని.. అందుకే ఇప్పుడు ఆయనను పక్కకు పెట్టే పనిలో ఉన్నట్లు సమాచారం. కొరటాల శివ తో ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నాడు అన్న విషయం తెలిసిందే. కానీ ఇంకా సెట్స్ పైకి రాలేదు.  దీంతోనే కొరటాల శివ సినిమాను పక్కకు పెట్టి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా చేయడానికి ఎన్టీఆర్ సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.  ఒకవేళ ఇదే నిజమైతే కొరటాల శివ కాంబినేషన్లో రావాల్సిన సినిమా అటకెక్కుతుంది అనడంలో సందేహం లేదు. మరి ఇప్పటికైనా కొరటాల శివ అలర్ట్ అయ్యి తన సినిమాలను ముందుగా సెట్స్ పైకి తీసుకొస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: