ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షోతో యాంకర్ గా పరిచయమైంది అనసూయ. ఆ షో తో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి ఎంతటి గుర్తింపును తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే జబర్దస్త్ మాజీ యాంకర్ అనసూయ గతకొన్నాలు బుల్లితెరకు మరియు వెండితెరపై కూడా ఎక్కడా కూడా కనిపించడం లేదు. ఇటీవల ఆమె జబర్దస్త్ యాంకరింగ్ ను మానేసిన సంగతి మనందరికీ తెలుసు. సినిమాలలో అవకాశాలు రావడంతో బుల్లితెరకు దూరమైంది అనసూయ. అనంతరం హీరోయిన్ స్థాయి క్రేజ్ ను సంపాదించుకుంది. కానీ ఈ మధ్య మాత్రం వరుస సినిమాలలో అనసూయ నటిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేక పోతుంది.
దాంతో ఆశించిన స్థాయిలో ఆఫర్లను కూడా సొంతం చేసుకోవడంలో ఫెయిల్ అయింది అనసూయ. అనసూయ కి స్టార్ మా నుండి ఆఫర్ రావడం దాంతోపాటు సినిమాలలో కూడా వరుసగా ఆఫర్లు రావడంతో ఈమె జబర్దస్త్ మానేసింది అని అంటున్నారు .అనసూయ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జబర్దస్త్ లో ఉన్నప్పుడు ఈమెకి వరుసగా సినిమాలలో అవకాశాలు వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం అనసూయని ఎవరూ పట్టించుకోవడం లేదు అన్న పుకార్లు వినిపిస్తున్నాయి. సాధారణంగా అనసూయ తలుచుకుంటే ఆమెకి ఉన్న ఇమేజ్ కు తగ్గట్టు వరుసగా ఒకేసారి 10 సినిమాలు కూడా అనసూయ కమిట్ కావచ్చు.
కానీ ప్రస్తుతం అనసూయ అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుందని అంటున్నారు. ఇక దానికి కారణం ఏంటా అని చూస్తే.. అనసూయ జబర్దస్త్ కార్యక్రమాన్ని మానేసింది అనే సమాధానమే వినిపిస్తుంది. జబర్దస్త్ చేస్తున్న సమయంలో అనసూయకి ఎంతటి క్రేజ్ వచ్చిందో దానికి తగ్గట్టుగానే తనకి భారీ ఎత్తున సినిమాల్లో ఆఫర్లు కూడా వచ్చేవి.దాంతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అనసూయకి ఉండేది.జబర్దస్త్ మానేయడంతోనే అనసూయ కి ఆఫర్లు తక్కువయ్యాయని ఈ సందర్భంగా చాలా మంది అంటున్నారు.ప్రస్తుతం ఈ అమ్మడు మళ్ళీ జబర్దస్త్ కి రీ ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటోందట..!!