ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీకి చాలామంది కొత్త హీరోలు వచ్చారు. ఇక వారిలో ఆడియన్స్ ని చాలా బాగా ఆకట్టుకున్న హీరో విశ్వక్సేన్. భిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు విశ్వక్సేన్. ఈ నగరానికి ఏమైంది అని సినిమా నుండి మొన్న వచ్చిన ఓరి దేవుడా సినిమా వరకు అన్ని సినిమాలు కూడా హిట్ టాక్ ని అందుకున్నాయి. ఆయన చేసే సినిమాలన్నీ కూడా యూత్ కి బాగా కనెక్ట్ అవ్వడంతో మంచి హీరోగానే కాకుండా దర్శకుడిగా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. విశ్వక్సేన్ హీరోగా మరియు దర్శకుడిగా నిర్మాతగా వ్యవహరించిన ధమ్కీ సినిమా ఈనెల 22వ తేదీన పాన్ ఇండియా లెవెల్లో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ట్రైలర్ మరియు పాటలు విడుదలై మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి. కచ్చితంగా ఈ సినిమా కూడా ముందు సినిమాలు లాగే యూత్‌ని బాగా ఆకట్టుకునే విధంగా ఉంటుందని ఈ సినిమా ట్రైలర్ టీజర్ లో చూస్తేనే అర్థమవుతుంది. ఇదిలా ఉంటే ఇక ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాదులో మార్చి 18న జరపనున్నారని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్‌కి విశ్వక్సేన్ వీరాభిమాని అన్న విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ విషయాన్ని స్వయంగా విశ్వక్సేన్ చాలా సందర్భాలలో చెప్పాడు.
తాను ప్రాణం పెట్టి తీసిన ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ ని ఆయన ఆహ్వానించినట్లుగా సమాచారం .అంతేకాదు గత కొద్ది రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్ ని స్వయంగా విశ్వక్సేన్ కలిసి ప్రత్యేకంగా ఆహ్వానించాలని తెలుస్తోంది.ఇక జూనియర్ ఎన్టీఆర్ ఆ సమయంలో ఇండియాలో ఉంటే కచ్చితంగా త్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తానని విశ్వక్సేన్ కి మాట కూడా ఇచ్చాడట. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక అలాంటి ఒక సినిమా రిలీజ్ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ వస్తే కచ్చితంగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకునే అవకాశాలు ఉంటాయి..!!