గత సంవత్సరం
మార్చి 25 వ తేదీన విడుదలై పాన్ వరల్డ్ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన ఫిల్మ్ 'ఆర్ఆర్ఆర్'.
జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో
టాలీవుడ్ స్టార్ హీరోస్ యంగ్ టైగర్
ఎన్టీఆర్ ఇంకా మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మల్టీ స్టారర్
మూవీ ఇది. ప్రపంచవ్యాప్తంగా 1250 కోట్లకు పైగా వసూళ్లు సాధించి
బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ
rrr సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేయబోతోంది. ఓటీటీలో సూపర్ హిట్ గా నిలిచి.. అవార్డుల మీద అవార్డులు అందుకుంటున్న
ఆర్ఆర్ఆర్ సినిమాను రీరిలీజ్ చేసేందుకు మేకర్స్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా రీ రిలీజ్ ట్రైలర్ ను కూడా విడుదల చేయగా అది వైరల్ అవుతుంది.యూఎస్ఏలో మళ్లీ రిలీజ్ చేయనున్నారు.
మార్చి 3 వ తేదీన దాదాపు 200 థియేటర్ల రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఇప్పుడు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎస్ఎస్
రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్'
సినిమా పలు ప్రపంచ ప్రఖ్యాత అవార్డులను సొంతం చేసుకుంది.
హాలీవుడ్ దిగ్గజ దర్శకులు
జేమ్స్ కామెరూన్ ఇంకా స్టీవెన్ స్పీల్ బర్గ్ ప్రశంసలు కురిపించారు. ఈ
సినిమా ఆస్కార్స్ బరిలో నిలవడంతో పాటు.. గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్ ఇంకా
హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులను దక్కించుకుంది. ఇప్పుడు
ఆర్ఆర్ఆర్ మూవీని మరోసారి రీరిలీజ్ చేస్తూ ఉండడం విశేషం. ఇండియాలో
ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్ ఆగిపోయినా.. ఈమధ్య జపాన్‌లో 1 బిలియన్ జపనీస్ యెన్ మార్కును అధిగమించింది.
జపాన్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన మొదటి భారతీయ సినిమాగా
ఆర్.ఆర్.ఆర్ నిలిచింది. ఇప్పుడు రీరిలీజ్ లో ఈ
సినిమా ఇంకెంత వసూళ్లు చేస్తుందో చూడాలి. ఈ వీకెండ్ లో ఈ
సినిమా రిలీజ్ అవుతుంది.ఈ వీకెండ్ లో దుమ్ముదులపడం ఖాయం.