RRR: ఆస్కార్ వేదికపై.. నాటు నాటు పాట లైవ్ ప్రదర్శన కన్ఫామ్..!!

Divya
ఇప్పటికే ఇంటర్నేషనల్ అవార్డులను కైవసం చేసుకున్న చిత్రం RRR. ఈ సినిమా గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా సొంతం చేసుకున్నది. అంతేకాకుండా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో కూడా ఆస్కార్ నామినేషన్లు అవార్డు అందుకున్నది. ఇక అంతే కాకుండా ఆర్ఆర్ ఆర్ నుంచి అదిరిపోయి అప్డేట్ కూడా విడుదల అవుతూ ఉంటోంది .ఆస్కార్ వేదిక పైన నాటు నాటు లైన్ అప్ డాన్స్ పెర్ఫార్మషన్ ఉంటుందని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ లైవ్ పెర్ఫార్మెన్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ చేస్తారని అందరూ అనుకున్నారట.కానీ ఒరిజినల్ గా పాడిన రాహుల్ సింగ్ ,కాలభైరవ 95 వ అకాడమీ అవార్డు వేడుకలలో లైవ్ ప్రదర్శన ఇస్తారని అధికారికంగా వార్తలు వినిపించాయి.

ఇక మార్చి 12వ తేదీన ఆదివారం నాడు ఈ వేడుక జరగబోతున్నది. అకాడమీ అవార్డుల నుంచి అధికారికంగా ఈ తేదీ ఖరారు అయినట్లుగా సమాచారం. rrr చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు లభించింది. ఈ సినిమాలో నటించిన నటీనటులు సాంకేతిక నిపుణులు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటూ ఉన్నారు. ఇందులో భాగంగా నాటు నాటు పాటకు కూడా బాగా పాపులర్ అవ్వడమే కాకుండా రెస్పాన్స్ కూడా అదిరిపోయేలా వస్తోంది.

ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అందుకున్నది.ఇక హాలీవుడ్ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులను ఐదు విభాగాలలో దక్కించుకుంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన rrr చిత్రం ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే రెస్పాన్స్ ను అందుకున్నది. మార్చి 12వ తేదీన లాస్ట్ ఏంజెల్ వేదికగా ఈ అవార్డును ప్రధానోత్సవం జరగబోతోంది.
ఇటీవల కాలంలో రాజమౌళి పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు పొందడమే కాకుండా పాన్ వరల్డ్ లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం మహేష్ బాబుతో తన తదుపరి చిత్రాన్ని చేయడానికి ఫిక్స్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: