గ్రేట్ డైరెక్టర్ జక్కన్న.. ఆ నిర్మాతకు అన్యాయం చేస్తున్నాడా?
కానీ ఇప్పుడు ఏకంగా దిగ్గజ దర్శకుడుగా పేరు సంపాదించుకున్న రాజమౌళి అలాంటి నిర్మాతనే పక్కన పెట్టేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమా ఎంత గొప్ప విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ సినిమా వందల కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రస్తుతం అంతర్జాతీయ వేదికలపై ఎన్నో పురస్కారాలు అందుకుంటుంది. దీంతో త్రిబుల్ ఆర్ టీం మొత్తం ఎప్పుడు దేశ విదేశాల్లో ప్రత్యక్షమవుతూ ఉండటం కూడా చూస్తూ ఉన్నాం.
అయితే ఇక ఇలా త్రిబుల్ ఆర్ టీం అంతర్జాతీయ వేదికలపై సందడి చేస్తున్న సమయంలో ఒక సాదాసీదా సింగర్ స్థాయి నుంచి హీరోలు, దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్, రచయితల వరకు అందరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కానీ వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిన దానయ్య పేరు మాత్రం గోల్డెన్ గ్లోబ్ వేదికపై ఎక్కడ ప్రస్తావించలేదు. క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ సమయంలో కూడా దానయ్యకు క్రెడిట్ ఇవ్వలేదు. ఇక దానయ్యకు జక్కనకు మధ్య ఎక్కడో చెడింది అన్న వార్త కూడా ప్రచారంలో ఉంది. సినిమాని ఆస్కార్ వరకు తీసుకెళ్లేందుకు అమెరికాలో ప్రస్తుతం ప్రమోషన్స్ చేస్తున్నారు. దీనికి 50 కోట్ల వరకు ఖర్చయిందట. ఈ డబ్బులు దానయ్య సమకూర్చకపోవడం వల్ల రాజమౌళి స్వయంగా భరించారట. దీంతో ఇక నిర్మాత పేరును ప్రస్తావించకుండా ఆయనను పక్కన పెడుతున్నారు అన్నది తెలుస్తుంది. కారణాలు ఏమైనా వందల కోట్ల బడ్జెట్ పెట్టిన నిర్మాతను పక్కన పెట్టడం మాత్రం ఏ మాత్రం బాగాలేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.