సినీ ఇండస్ట్రీలో విషాదం.. సినిమాటోగ్రాఫర్ కన్నుమూత..!!

Divya
ఇటీవల గడిచిన కొంతకాలం నుంచి ఎక్కువగా టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గత ఏడాది కృష్ణ ,కృష్ణంరాజు, కృష్ణ భార్య, కైకాల, చలపతిరావు వంటి వారు మరణించడం జరిగింది.వయసు మీద పడిపోయి కొంతమంది సెలబ్రెటీలు, డైరెక్టర్లు, నిర్మాతల సైతం అనారోగ్యంతో మరణిస్తూ ఉన్నారు. ఇక ఇదంతా మరువకముందే ఇటీవల కాలంలో వయసులో చిన్నవారైన కొంతమంది నటులు కన్నుమూస్తూనే ఉన్నారు. గడిచిన కొద్దిరోజుల క్రితం జమున, కళాతపస్వి కే.విశ్వనాధ్ ,విశ్వనాధ్ భార్య నందమూరి తారకరత్న అనారోగ్యంతో మరణించారు. ఈ విషాదం నుంచి కోలుకోకముందే ఇటీవలే టాలీవుడ్ లో మరొక విషాదం చోటుచేసుకుంది. గడచిన కొంతకాలంగా ఎక్కువగా టాలీవుడ్ లోని విషాదఛాయలు నెలకొంటూనే ఉన్నాయి.

ప్రముఖ ఛాయాగ్రహకుడు ప్రవీణ్ అనుమోలు గుండెపోటుతో మరణించినట్లుగా తెలుస్తోంది. ఆదివారం ఉదయం తర్వాత ఈ విషయం చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈయన  మరణం తో సినీ ఇండస్ట్రీ లో ప్రముఖులకు షాకింగ్ గా మారింది. వయసు లో చిన్నవాడు అయినప్పటికీ గుండెపోటు రావడంతో వైద్యసాయం అందేసరికి ప్రాణాలు పోయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలం లో పలువురు ప్రాణాలు సైతం ఎక్కువగా గుండెపోటుతోనే మరణిస్తూ ఉన్నారు. 2017 లో విడుదలైన దర్శకుడు అనే సినిమాకి సినిమా టోగ్రాఫర్ గా పనిచేసిన ప్రవీణ్ ఆ తర్వాత బాజీరావు మస్తానీ, బేబీ, ధూమ్-3, యమదొంగ తదితర చిత్రాలకు అసిస్టెంట్ కెమెరామెన్ గా కూడా పనిచేశారట.

అలా టాలెంటెడ్ టెక్నీషియన్ గా పేర్కొన్న ప్రవీణ్ మరణంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు నెలకొన్నాయి. పలువురు ప్రముఖులు సైతం ప్రవీణ్ మృతికి తీవదిగ్రాంతి అవుతున్నారు. ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో యువత సినీ సెలబ్రిటీస్ సైతం ఎక్కువగా గుండెపోటుతోనే మరణిస్తూ ఉన్నారు. ఈ విషయం ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురిచేస్తోందని చెప్పవచ్చు. గత ఏడాది ఈ ఏడాది గుండెపోటుతోనే చాలామంది సెలబ్రిటీలు సైతం మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: