ఆ ఒక్క సినిమాతో స్టార్ డైరెక్టర్ క్రేజ్ తగ్గిందా...?
ఐతే భారీ అంచనాల నడుమ విడుదలైన ఆ f3 సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవడంతో అనిల్ రావిపూడి క్రేజ్ ఒక్కసారిగా పడిపోయినట్లు అయింది. ఆయన స్థాయిలో ఆ సినిమా లేదని విమర్శలు వ్యక్తం అయ్యాయి.ఐనా కూడా వెంటనే నందమూరి బాలకృష్ణ తో సినిమా చేసే అవకాశాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి సొంతం చేసుకున్నాడు. ఎఫ్ 3 సినిమా నిరాశ పర్చడం తో డైరెక్టర్ అనిల్ రావిపూడి యొక్క రెమ్యూనరేషన్ చాలా తగ్గింది అనే ప్రచారం మీడియా సర్కిల్స్ లో జరుగుతోంది. కానీ అసలు విషయం ఏమిటంటే ఎఫ్3 సినిమా ఫలితంకు ఏ మాత్రం తగ్గకుండా డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ మూవీ కి కూడా మంచి రెమ్యూనరేషన్ అందుకు అంటున్నాడట.
బాలయ్యబాబు మూవీ అంటే మినిమం బడ్జెట్ ఉంటుంది అలాగే మంచి బిజినెస్ కూడా జరుగుతుంది. కనుక ఈ మూవీ విడుదలైన తర్వాత లాభాల్లో వాటా కూడా డైరెక్టర్ అనిల్ రావిపూడి సొంతం చేసుకోబోతున్నాడు అనే ప్రచారం జరుగుతుంది. ఒక్క సినిమా ఫ్లాప్ తో రెమ్యూనరేషన్ తగ్గడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అనిల్ రావిపూడి కి పారితోషికం భారీగా తగ్గింది అనేది మాత్రం పూర్తిగా అవాస్తవం. మరో రెండు మూడు సినిమాలు కూడా నిరాశ పరిచితే అప్పుడు దర్శకుడు అనిల్ రావిపూడి పారితోషికం విషయం లో వెనక్కి తగ్గాల్సి ఉంటుందేమో కానీ ఒక సినిమా ఫెయిల్ అయితే రెమ్యూనరేషన్ విషయంలో తగ్గింపు అనేది చాలా రేర్ గా జరుగుతుంది. ఐతే అనిల్ రావిపూడి కి అలాంటి ఇబ్బంది ఏమి లేదని ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం అందుతుంది.
ఐతే బాలయ్య బాబు మరియు అనిల్ కాంబో లో వచ్చే మూవీ ఇరిరువురి అభిమానులకు కన్నుల పండగగా ఉంటుంది ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు.