నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమాను పూర్తి చేసిన వెంటనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో సినిమా చేసే పనిలో బిజీగా ఉన్నాడు బాలకృష్ణ .ఈ సినిమాతో పాటు బాబి దర్శకత్వంలో కూడా బాలకృష్ణ ఒక సినిమా చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోని గోపీచంద్ మల్లిని మరియు బాలకృష్ణ కాంబినేషన్ లో మరొక సినిమా కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటిస్తే ఆ సినిమా ఎలా ఉన్నా కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుంది అని ఒక కొత్త సెంటిమెంట్ తెరపైకి వస్తు వైరల్ గా మారుతుంది.
బాలయ్య అలా కనిపిస్తే కచ్చితంగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంటుంది అని చెప్పలేం.
కానీ డ్యూయల్ రోల్ లో నటిస్తే ఆ పాత్ర పవర్ ఫుల్ గా ఉంటే మాత్రం కచ్చితంగా ఆ సినిమా ఎలా ఉన్నా సరే మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుంది అంటూ నందమూరి అభిమానులు తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. సింహా , లెజెండ్, అఖండ,వీరసింహారెడ్డి వంటి సినిమాలు ఈ సెంటిమెంట్ 100% నిజమని రుజువు చేశాయి. ఇక అలాంటి పాత్రలో రాబోయే సినిమాల్లో కూడా నందమూరి బాలకృష్ణ నటిస్తే చూడాలని ఉంది అంటూ కోరుకుంటున్నారు నందమూరి అభిమానులు. ఈ నేపథ్యంలోనే అనిల్ మరియు బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో బాలకృష్ణ సింగిల్ రోల్ లోనే కనిపిస్తాడట.
అనంతరం బోయపాటి మరియు బాలకృష్ణ కాంబినేషన్లో అఖండ సీక్వెల్ రానున్న సంగతి మన అందరికి తెలిసిందే.ఈ సినిమా ఎక్కడైతే ముగిసిందో అక్కడినుండే ఈ సినిమా సీక్వెల్ మొదలవుతుందని అంటున్నారు. బాలకృష్ణ నటించిన అఖండా సినిమా సీక్వెల్ 100 కోట్ల కి పైగానే భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతోందని సమాచారం .అఖండ సినిమా కంటే పెద్ద ఎత్తున ఈ సినిమా విజయాన్ని అందుకోవాలి అన్న నేపథ్యంలో బోయపాటి ఈ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోని బాలయ్యకి మరో బ్లాక్ బస్టర్ హిట్టు ఖచ్చితంగా బోయపాటి అందిస్తారు అన్న నమ్మకంతో ఉన్నారు నందమూరి అభిమానులు. ఈ నేపథ్యంలోనే సినిమా సినిమాకి బాలయ్య రెమ్యూనరేషన్ పెరిగిపోవడంతో అందరూ షాక్ అవుతున్నారు ..ప్రస్తుతం బాలకృష్ణ మాస్ మసాలా సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!