ఎంతటి స్టార్స్ కి అయినా కూడా బ్యాడ్ టైం ఉంటుంది. తీసిన ప్రతి
సినిమా విజయం సాధించడం అనేది దాదాపు అసాధ్యం. ఇకపోతే కొంత మంది హీరోలకు కొన్ని కథలు మాత్రమే బాగా నప్పుతాయి అని అంటూ ఉంటారు. అందులో నిజం లేకపోలేదు. అందుకు
మెగాస్టార్ లాంటి హీరోలు కూడా అతీతం ఏమి కాదు.
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ మొత్తం మీద ఎక్కువగా
మాస్ సినిమాలు చేస్తూ వచ్చారు. అందుకే తనకు అలంటి కథలు బాగా సూట్ అవుతాయి అనే ఉద్దేశం అందరికి ఉంటుంది. కానీ ఆ ముద్ర పోగొట్టుకోవాలని చిరు చాల ప్రయత్నించారు. అందుకే
మాస్ ఇమేజ్ బాగా ఉన్న టైం లో రుద్రవీణ వంటి ఒక ప్రయోగాత్మక క్లాసిక్ చిత్రం లో నటించారు. నిజానికి రుద్రవీణ ఒక అద్భుతమైన కథ. కానీ
సినిమా పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. కేవలం ఈ చిత్రం లో చిరు క్లాస్ గా కనిపించడం వల్లనే
సినిమా ప్లాప్ అయ్యింది.
చిరంజీవి అంటే మినిమమ్ స్టెప్స్, ఫైట్స్ ఉండాలి అని రుద్రవీణ సినిమాలో ఒక్క ఫైట్ కూడా లేకపోవడం తో జనాలు తిప్పి పంపారు. ఇక ఇదే దోవలో కె విశ్వనాధ్ దర్శకత్వం లో రుద్రవీణ తరహాలోనే ఆపద్భాందవుడు చేసాడు చిరు. ఈ చిత్రం కూడా సేమ్ ఫలితం వచ్చింది. చిరు యాక్టింగ్, దర్శకత్వం ఎంతో బాగా ఉన్న కూడా ఈ
సినిమా ఫెయిల్ అవ్వడం తో
మెగాస్టార్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. దాంతో చిరు మనసులో ఇక క్లాసిక్స్ జోలికి వెళ్లకూడదని డిసైడ్ అయ్యి కేవలం
మాస్ సినిమాలకు ఓటేశారు. ఇప్పటికి కూడా చిరు కి ఆచార్య
సినిమా ఫ్లాప్ తో మళ్లి వురమాస్
సినిమా లు చేయాలనే తహతహ పుట్టింది. అందుకే వాల్తేరు వీరయ్య
సినిమా చేయగా అది హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు భోళా
శంకర్ సినిమాతో బిజీ గా ఉన్నాడు
మెగాస్టార్ చిరంజీవి.