లావణ్య త్రిపాఠి మొదటి రెమ్యూనరేషన్ ఎంత.. వాటిని ఏం చేసిందంటే..?
ఈ మధ్య పలు లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయుతోంది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పటికి దశాబ్దం కాలం అవుతున్న ఇప్పటికీ ఎన్నో చిత్రాలలో నటించి మెప్పించింది. వెండితెరపైనే కాకుండా ఓటీటి లో కూడా ఈ మధ్య సందడి చేస్తోంది. ఇటీవల తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై కూడా స్పందించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. ప్రతి ఒక్కరు కూడా తన పెళ్లి గురించి మాట్లాడుతున్నారని సమయం వచ్చినప్పుడు అదే జరుగుతుందని తెలియజేసింది లావణ్య త్రిపాఠి.తన పెళ్లి విషయం లో తల్లితండ్రులు ఒత్తిడి ఏమీ లేదని ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం మూవీస్ పైన ఉందని తెలుపుతోంది.
అలాగే తన మొదటి రెమ్యూనరేషన్ విషయంపై కూడా స్పందించింది. తాను పదహారేళ్ళ వయసులో ఉన్నప్పుడే ఒక షోని చేశానని అందుకోసం కేవలం రూ.5000 వేలు తీసుకున్నట్లుగా తెలియజేసింది. ఇక ఆ డబ్బుతో మొదటి సారీ తన మొబైల్ ని కొనుక్కున్నట్లు తెలియజేసింది. దీంతో అభిమానులు తనం ఫస్ట్ మొబైల్ ఏ బ్రాండ్ ది అయ్యుంటుంది అంటు కామెంట్లు చేస్తున్నారు. ఇక గత ఏడాది హ్యాపీ బర్తడే లావణ్య అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పర్వాలేదు అనిపించుకుంది. ఇక రీసెంట్గా పులిమేక అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది. లావణ్య త్రిపాఠి కి సంబంధించి ఈ విషయం వైరల్ గా మారుతోంది.